
ఈ సినిమాకు సంబంధించిన తొలి పాటను ‘రంగస్థలం’ హీరోయిన్ సమంత విడుదల చేయడం విశేషం. ‘అందమా…’ అనే మెలోడీ సాంగ్ కు సంబంధించిన ఫుల్ వీడియోను రిలీజ్ చేసి, విడుదల తేదీని ఖరారు చేసారు. ‘బిచ్చగాడు’ సినిమా తర్వాత విజయ్ అంటోనీ నటిస్తున్న సినిమాలకు ఓపెనింగ్స్ బాగానే వస్తున్నా, వాటిని నిలబెట్టుకోవడంలో మాత్రం విజయ్ విఫలమవుతున్నాడు. మరి ఈ ‘కాశి’ చిత్రంతో అయినా ఆకట్టుకుంటాడో లేదో చూడాలి.
అయితే ‘రంగస్థలం’ మాదిరే ఈ ‘కాశి’ కూడా గ్రామీణ వాతావరణంలో సాగే మాస్ సినిమా కావడం గమనించదగ్గ విషయం. రామ్ చరణ్ తో విజయ్ అంటోనీ పోటీ అని చెప్పలేం గానీ, ఈ రెండు సినిమాలు ఒకే జోనర్ కు చెందినవి కావడం, ఒకే రోజున విడుదల కావడం కాకతాళీయమే! బహుశా రిలీజ్ డేట్ దగ్గరకు వచ్చే సమయానికి ‘కాశి’లో మార్పు ఉండొచ్చు అనేది ట్రేడ్ టాక్.
Jailer 2 is back in the news for an interesting reason. Rajinikanth had recently said…
దశాబ్దాల వెలిగొండ ప్రాజెక్టులో నిన్న నీళ్ళు పారాయి. అలాగే దశాబ్దాలుగా విశాఖ వాసులు ఎదురు చూస్తున్న గోదావరి జలాలు పోలవరం…