Telugu

రేపటి పోలింగ్: పిల్లికి చెలగాటం, ఎలుకకు ప్రాణసంకటం! పిల్లి, ఎలుక ఎవరు?

ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయి. నిజానికి చెదురుమదురు ఘటనలు మినహా ఈ ఎన్నికలు చాలా సజావుగా, ప్రశాంతంగా సాగాలి. కానీ వైసీపీ ఈ ఎన్నికలను సుప్రీంకోర్టు వరకు తీసుకు వెళ్ళి వ్యవస్థలపై అనుమానాలు రేకెత్తించింది. ఎన్నికలను వాయిదా వేయించింది.

నామినేషన్స్‌లో ఘర్షణలకు వైసీపీని మాత్రమే నిందించలేము. ఎందుకంటే రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు మోగుతాయి కనుక.

ADVERTISEMENT

ఈ ఎన్నికల్లో శాంతిభద్రతలకు భంగం కలిగించడం, కలిగిందనే విషయాన్ని జాతీయ మీడియా చెవిలో వేయడం తప్పే. దీంతో ఏపీ బ్రాండ్ ఇమేజ్ దెబ్బ తింటుంది.

ఇవన్నీ సరిపోవన్నట్లు రేపు పోలింగ్ రోజున భారీగా రిగ్గింగ్ జరగబోతోందంటూ ప్రజలను భయ పెట్టడం, రేపు నేనే స్వయంగా చొక్కా మడత పెట్టి వస్తా ఎవరు అడ్డుకుంటారో అడ్డుకోండి.. అంటూ టీడీపికి, ప్రభుత్వానికి, పోలీసులకు జగన్‌ సవాళ్ళు విసరడం చాలా దురదృష్టకరం. ఇలాంటివన్నీ కూడా రాజకీయ వ్యూహాలే అని భావించడం చాలా శోచనీయం.

కనుక రేపు జరగబోయే పోలింగ్ పిల్లికి చెలగాటం, ఎలుకకు ప్రాణసంకటం అన్నట్లు భావించవచ్చు. వాటిలో పిల్లి ఎవరు? ఎలుక ఎవరు? రేపు తెలుస్తుంది.

కానీ స్థానిక సంస్థల ఎన్నికలలో ఈవిధంగా జరుగుతుంటే, ఆంధ్రప్రదేశ్‌ ప్రతిష్ట దిగజారదా?అయినా పర్వాలేదా? రాష్ట్రంలో పరిశ్రమలు, పెట్టుబడులు పెట్టేందుకు వస్తున్నవారు ఈ అల్లర్లు, బెదిరింపులు చూసి వెనకడుగు వేస్తే మరోసారి రాష్ట్రంలో నష్టపోతుంది. అయినా పర్వాలేదా? ఆలోచిస్తే బాగుంటుంది.

ఒకవేళ ఆలోచించకపోతే ఓటర్లే బాగా ఆలోచించి రాష్ట్ర ప్రతిష్ట, ప్రయోజనాలకు భంగం కలిగిస్తున్న పార్టీలకు ఓటు ద్వారా బుద్ధి చెప్పాలి.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Day 1 BO: How Did AK47 And Cult Start?

Telugu cinema witnessed two new theatre films this weekend in the form of Aadarsha Kutumbam(AK-47)…

8 minutes ago

Itlu Arjuna Locks Its Release Date

Itlu Arjuna brings together a new combination of actors, an unconventional protagonist and a music…

27 minutes ago