
ఇదివరకు.. అంటే ఆంధ్రాలో వైసీపీ, తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వాలు అధికారంలో ఉన్నప్పుడు, ఆంధ్రా అభివృద్ధి గురించి పెద్దగా చెప్పుకోవడానికి ఏమీ ఉండేది కాదు. కానీ తెలంగాణ గురించి చెప్పుకోవాల్సివస్తే అక్కడ జరుగుతున్న అభివృద్ధి గురించే అందరూ చెప్పుకునేవారు.
కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి గురించి చెప్పుకునేందుకు చాలానే ఉన్నాయి. కానీ వాటి గురించి గొప్పగా, గర్వంగా చెప్పుకోవాల్సిన ఈ సమయంలో, వాటికి బదులు తమ రాజకీయాలతో ప్రజల దృష్టి ఆకర్షిస్తోంది. కనుక ప్రజలు రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పనులకు బదులు, కూటమి ప్రభుత్వం-వైసీపీ మద్య జరుగుతున్న రాజకీయ ఆధిపత్యపోరు గురించి చర్చించుకునేలా వైసీపీ చేస్తోందని చెప్పవచ్చు.
నాడు ‘మీ రాజధాని ఏది? ఎక్కడ?’ అని ఎవరైనా అడిగితే ఆంధ్రా ప్రజలు జవాబు చెప్పుకోలేక సిగ్గుతో తలదించుకోవాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ‘ఇదిగో మా రాజధాని అమరావతి’ అని గర్వంగా చెప్పుకోవాల్సిన సమయంలో మావిగన్ అంటూ వైసీపీ అధినేత జగన్ మళ్ళీ గందరగోళం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు.
వైసీపీ హయంలో ప్రాజెక్టుల గేట్లు కూడా మరమత్తుకు నోచుకోలేదని జగన్ సోదరి వైఎస్ షర్మిల ఆరోపిస్తుంటారు. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఓ పక్క పోలవరం, వెలిగొండ వంటి భారీ ప్రాజెక్టులను పూర్తి చేస్తూనే, మరోపక్క ధవళేశ్వరంకి కొత్త గేట్లు అమర్చుతోంది.
కనుక ప్రజలు ఏపీలో సాగునీటి ప్రాజెక్టుల గురించి చెప్పుకోవాల్సిన ఈ సమయంలో, తెలంగాణలో బీఆర్ఎస్, టీఆర్ఎస్ పార్టీలు బురద జల్లుతున్నాయి. అంటే ఈసారి ఈ బురద బాధ్యతని బీఆర్ఎస్ పార్టీ తీసుకుందని సరిపెట్టుకోవాలేమో? వాళ్ళు బురద జల్లుతున్నా వైసీపీలో ఉలుకు పలుకు లేదు. మౌనం అర్ధాంగీకారం అంటారు. కనుక తమ మనసులో అక్కసునే బీఆర్ఎస్ వెళ్ళగక్కుతోందనే వైసీపీ మౌనం వహిస్తోందనుకోవలేమో?
ఇలా చెప్పుకుంటూ పోతే చాలా పెద్ద జబితాయే ఉంది. కానీ ఇప్పుడు అభివృద్ధి గురించి నాలుగు ముక్కలు చెప్పుకునే భాగ్యం దక్కింది కనుక అవే చెప్పుకుందాం.
సిఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన నేడు జరుగుతున్న మంత్రివర్గ సమావేశంలో ఆమోదముద్ర వేయబోతున్న పనులు, పధకాలు.
అగ్నిమాపక శాఖకి వాహనాలు, పరికరాలు కొనుగోలు.
బాపట్ల జిల్లా వెదుళ్ళపల్లి లో వినికిడి లోపం ఉన్న విద్యార్ధుల కొరకు ప్రభుత్వం డిగ్రీ కళాశాల ఏర్పాటు.
3,168 ప్రభుత్వోద్యోగాలు భర్తీ.
నేతన్న భరోసా పధకం కింద చేనేత కార్మికుల ఒక్కో కుటుంబానికి రూ.25,000 చొప్పున ఆర్ధిక సాయం.
సమావేశం ముగిసిన తర్వాత మరిన్ని వివరాలు బయటకు వస్తాయి.
India beat Afghanistan by 7 wickets in the second T20I in Delhi to take an…
With Rohith and Trigun emerging as the potential gamers in the Bigg Boss reality show,…