
అమరావతి కోసం భూములిచ్చిన రైతులు తమ వాటాగా పొందే వాణిజ్య, నివాస ప్లాట్లను తొలిసారి విక్రయించగా వచ్చే సొమ్ముపై పన్ను (క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్)ను తొలగిస్తున్నట్టు జైట్లీ ప్రకటించనున్నట్టు సమాచారం. రాజధాని నిర్మాణం కోసం భూములిచ్చిన వారికి ప్రభుత్వం మెట్టకు ఎకరానికి వెయ్యి గజాల రెసిడెన్షియల్ ప్లాటు, 250 గజాల వాణిజ్య ప్లాటు కేటాయించింది. అదే జరీబు భూములైతే వెయ్యి గజాల నివాస స్థలం, 450 గజాల కమర్షియల్ ప్లాటు ఇస్తోంది.
రాజధాని నిర్మాణం వల్ల ఈ ప్రాంతంలో స్థలం విలువ భారీగా పెరుగుతుందని, రైతులు తమ వాటా ప్లాట్లను విక్రయించుకోవడం ద్వారా ప్రయోజనం పొందవచ్చని అప్పట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్న విషయం తెలిసిందే. తొలి విక్రయం ద్వారా వచ్చిన డబ్బుపై క్యాపిటల్ గెయిన్స్ పన్నును మినహాయించాలని రాజధాని రైతులు తొలి నుంచి కోరుతున్నారు. గతేడాది రాజధాని ప్రాంతానికి వచ్చిన అరుణ్ జైట్లీ, వెంకయ్య నాయుడు వద్ద కూడా మొరపెట్టుకున్నారు. దీంతో స్పందించిన మోడీ సర్కార్, క్యాపిటల్ గెయిన్స్ పన్నును మినహాయించాలంటే ప్రత్యేకంగా చట్టం తీసుకురావాల్సి ఉంటుందని ఓ సందర్భంలో పేర్కొన్నారు.
తాజాగా కేంద్ర క్యాబినెట్ ఆమోదంతో క్యాపటిల్ గెయిన్స్ పన్ను మినహాయింపును బడ్జెట్ లో పెట్టాలని ఆర్థికమంత్రి నిర్ణయించినట్టు తెలుస్తోంది. దీంతో పాటు బడ్జెట్ లో ఏపీకి బోల్డెన్ని వరాలున్నట్టు సమాచారం. ఏపీకి పలు పరిశ్రమలు వచ్చే అవకాశంతో పాటు జాతీయ విద్యాసంస్థలకు నిధులు కూడా భారీగానే కేటాయించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మొత్తంగా చూసుకుంటే… మూడేళ్ళ నుండి బడ్జెట్ ప్రవేశపెడుతున్న అరుణ్ జైట్లీ, ఈ ఏడాది మాత్రం ఆంధ్రప్రదేశ్ సర్కార్ ను, రాష్ట్ర ప్రజానీకాన్ని సంతృప్తి చెందే విధంగా ప్రసంగిస్తారని ప్రీ రిలీజ్ బడ్జెట్ టాక్.
Raaka is already shaping up to be one of the most ambitious films of Allu…
Dhanush is currently one of the busiest actors in Kollywood with multiple projects in his…