ఏపీ జీఎస్టీ పడిపోయిందటగా.. నిజమా? ఎవరు బాధ్యులు?

జగన్‌ అధికారంలో ఉన్నప్పుడు ఆయన చుట్టూ ఏర్పడిన కోటరీ అందరినీ దూరం చేసి శల్యసారధ్యం చేస్తూ వైసీపీని ముంచేసిందని ఆ పార్టీలో ఒకప్పుడు నంబర్: 2 స్థానంలో ఉన్న విజయసాయి రెడ్డి చెప్పారు.

పార్టీ నేతలకి, క్యాడర్‌కి తాను మార్గదర్శనం చేస్తున్నానని జగన్‌ అనుకుంటారు. కానీ కోటరీయే ఆయనకు మార్గదర్శనం చేస్తున్నట్లు పలు ఉదాహరణలు కనిపిస్తున్నాయి.

ADVERTISEMENT

కూటమి ప్రభుత్వం, సిఎం చంద్రబాబు నాయుడు, ఆయన పాలన గురించి వైసీపీ సొంత మీడియా చేస్తున్న దుష్ప్రచారం గమనిస్తే ఇది అర్దమవుతుంది.

వైసీపీ సోషల్ మీడియాలో ఇరుగు పొరుగు రాష్ట్రాల జీఎస్టీ ఆదాయం గణనీయంగా పెరుగుతుంటే, ఆంధ్రప్రదేశ్‌ ఆదాయం మాత్రం మైనస్ 3లోకి వెళ్ళిపోయిందంటూ, సిఎం చంద్రబాబు నాయుడు ఫోటోతో ఓ పోస్ట్ పెట్టింది.

జీఎస్టీ ఆదాయం ప్రభుత్వం సృష్టించేది కాదని, వివిద ఉత్పత్తులు, సేవలపై విధించే పన్ను రాబడి అని అందరికీ తెలుసు.

కరోనా, లాక్ డౌన్‌ వంటి సమయాలలో మాత్రమే కొనుగోళ్ళు తగ్గిపోయాయి కనుక జీఎస్టీ ఆదాయం పడిపోయింది. ఏటా అన్నిటి ధరలు పెరుగుతూనే ఉన్నాయి తప్ప తగ్గడం లేదు. కనుక అదే నిష్పత్తిలో జీఎస్టీ కూడా పెరుగుతూనే ఉంటుంది తప్ప తగ్గదు.

కనుక ఏపీ జీఎస్టీ మైనస్ 3 శాతానికి పడిపోయిందని, అయినా సిఎం చంద్రబాబు నాయుడు కళ్ళు మూసుకు కూర్చున్నారంటూ వైసీపీ సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తోందని స్పష్టమవుతుంది. అంటే నేటికీ సిఎం చంద్రబాబు నాయుడుపై బురద జల్లడమే వైసీపీ విధానం అన్నట్లు సాగిపోతోంది తప్ప నిజానిజాలు నిర్ధారించుకుని, పద్దతిగా రాజకీయాలు చేద్దామనే ఆలోచన వైసీపీకి ఏ కోశాన్న లేదని అర్దమవుతోంది.

ఒకవేళ వైసీపీ చెపుతున్నట్లు నిజంగానే ఏపీ జీఎస్టీ ఆదాయం మైనస్‌ 3కి పడిపోతే, ఆ పాపం కూడా జగన్‌దే అవుతుంది కదా?

ఐదేళ్ళ పాలనలో రాష్ట్రానికి పరిశ్రమలు, ఐటి కంపెనీలు, వాణిజ్య సంస్థలని రప్పించి ప్రోత్సహించి ఉంటే జీఎస్టీ దానంతట అదే పెరిగేది కానీ అన్నిటినీ తరిమేసి ఇప్పుడు జీఎస్టీ రాబడి తగ్గిపోయిందని సిఎం చంద్రబాబు నాయుడుని నిందిస్తుండటం సిగ్గుచేటు!

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Recent Posts

First Direction, Next Acting? Jason Sanjay in the Spotlight

Vijay’s son Jason Sanjay chose to make his entry into films as a director rather…

14 minutes ago

No Relief At Supreme, But AP Set For Poll Battle

A little over two years after the previous Assembly elections, Andhra Pradesh is preparing for…

45 minutes ago