
ఏ రాష్ట్రంలోనైనా ప్రతిపక్ష పార్టీలు ఉద్యోగాల భర్తీ చేయాలని కోరుతూ ఆందోళనలు చేస్తాయి. కానీ మన ఏపీలో మాత్రం ప్రభుత్వం జాబ్ క్యాలండర్ ప్రకటించి దాని ప్రకారం ఉద్యోగాలు భర్తీ చేసినందుకు వైసీపీ ఆందోళన చేస్తోంది.
ఏపీ డీఎస్సీలో అవకతవకలు జరిగాయంటూ దుష్ప్రచారం చేస్తున్న వైసీపీ, ఇప్పుడు సీజేపీ స్పూర్తితో పార్టీ శ్రేణులను రోడ్లపైకి పంపించి దానినే జెన్-జీ ఉద్యమం అంటూ కొత్త ట్యాగ్ తగిలించుకోవడం చాలా హాస్యాస్పదంగా ఉంది.
ఓ పక్క వైసీపీ డీఎస్సీ పేరుతో రాజకీయాలు చేస్తుంటే, వాటికి మరో భారీ ఉద్యోగ నోటిఫికేషన్‌తోనే సమాధానం చెప్పేందుకు మంత్రి నారా లోకేష్ సిద్దమవుతున్నారు.
జాబ్ క్యాలండర్-2026 ప్రకారం భర్తీ చేయాల్సిన ఉద్యోగాల గురించి మంత్రి నారా లోకేష్ మంత్రులు, అధికారులతో బుదవారం సమావేశమయ్యి చర్చించారు.
దాని ప్రకారం మొత్తం 10,060 పోస్టులు భర్తీ చేయాల్సి ఉంటుంది. వాటిలో వివిధ విశ్వవిద్యాలయాలలో 1,523 పోస్టుల భర్తీకి ఇప్పటికే నోటిఫికేషన్ విడుదలైంది. కనుక సెప్టెంబర్ 15న మరో 3,168 పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేయాలని నిర్ణయించారు.
ఆ తర్వాత వరుసగా మరో రెండు నోటిఫికేషన్ల ద్వారా మొదట 2,388 పోస్టులు, 2,981 పోస్టులు భర్తీ చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. ఇవన్నీ జాబ్ క్యాలండర్-2026లో పేర్కొన్నవే కనుక ఈ ఏడాది డిసెంబర్‌లోగా వీటన్నిటినీ భర్తీ చేయాల్సి ఉంటుంది.
వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జాబ్ క్యాలండర్ బదులు సంక్షేమ క్యాలండర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. కనుక వైసీపీ చేయలేకపోయిన ఈ పనిని కూటమి ప్రభుత్వం జాబ్ క్యాలండర్ ప్రకటించి ఇంత ఖచ్చితం ఉద్యోగాలు భర్తీ చేస్తుంటే సంతోషించాలి కదా? కానీ వాటినీ అడ్డుకునేందుకు కుట్రలు చేస్తుంటే జెన్-జీ క్షమిస్తుందా? ఆలోచించుకుంటే మంచిది.
India beat Afghanistan by 7 wickets in the second T20I in Delhi to take an…
With Rohith and Trigun emerging as the potential gamers in the Bigg Boss reality show,…