Telugu

‘తుఫాన్లు’ చల్లబర్చిన వాతావరణాన్ని ‘స్థానిక ఎన్నికలు’ వేడెక్కిస్తున్నాయా?

దేశంలో ఎల్ నినో ప్రభావంతో వాతావరణం శీతాకాలంలో కూడా వేసవితాపాన్ని కలిగించేలా వేడెక్కుతుంటే, ఏపీలో మాత్రం వరుస తుఫాన్లతో వాతావరణం కాస్త చల్లబడింది. అక్టోబర్ నెలలో వచ్చిన అర్నబ్, నవంబర్ లో వచ్చిన మురసు, అక్వాన్ తుఫాన్లు ఏపీని కాస్త చల్లబర్చాయి.

అయితే తుఫాన్ల వంటి ప్రకృతి ప్రకోపాలను కూడా ముందస్తుగా అంచనా వేయగలిగిన టెక్నాలజీ ఉంది, కానీ రాజకీయంలో మరి ముఖ్యంగా ఎన్నికల వంటి కీలక ఘట్టాల్లో పార్టీలు, ఆయా పార్టీల నేతల చర్యల పై ఎటువంటి ముందస్తు హెచ్చరికలు ఉండవు.

ADVERTISEMENT

అలాగే ప్రకృతి విపత్తులకు తీసుకోవాల్సిన నష్ట నివారణ చర్యల మీద కూడా ఒక స్పష్టత ఉంటుంది కానీ రాజకీయ విపత్తులకు నష్టనివారణ చర్యలు కష్టసాధ్యం. ఏది ఏమైనా తుఫాన్లు చల్లబర్చిన వాతావరణాన్ని స్థానిక సంస్థల ఎన్నికలు వేడెక్కించాయనే చెప్పాలి.

ఏపీలోని రాజకీయ పార్టీలన్నీ కూడా స్థానిక సంస్థల ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. కూటమి పొత్తులోని టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల మధ్య ఏర్పడిన సీట్ల పంచాయితీలు మూడు పార్టీల మధ్య నిప్పు రాజేశాయి. మూడు పార్టీల అధిష్టానానికి తలనొప్పులు తెచ్చిపెట్టాయి.

అయితే ఇక్కడ ఒకరిది రాజకీయంగా తన పార్టీకి ఉన్న క్షేత్రస్థాయి ‘బలం కాపాడుకునే’ ప్రయత్నం అయితే మరొకరిది పార్టీని క్షేత్ర స్థాయిలో ‘బలపరుచుకునే’ ప్రణాళిక కాగా ఇంకొకరిది పార్టీ ‘ఉనికి నిలబెట్టుకునే’ అవకాశం. ఇలా ఈ మూడు పార్టీలు కూడా తమ ఉమ్మడి కుటుంబంలో ఉన్న అంతర్గత కలహాలను స్థానిక ఎన్నికల రూపంలో బయటకుతెచ్చి ఏపీ రాజకీయ వాతావరణాన్ని ఒక్కసారిగా వేడెక్కించాయి.

ఇక విపక్ష వైసీపీ విషయానికొస్తే, 2024 నాటి ఘోర ఓటమి అవమానాన్ని కుదించేందుకు, కూటమిపై తన రాజకీయ ఆధిపత్యం ప్రదర్శించేందుకు స్థానిక సంస్థల ఎన్నికలను ఒక యుద్ధంలా భావించింది. గెలిస్తే ప్రభుత్వ వ్యతిరేకత, ఓడితే ప్రభుత్వ అణిచివేత.. అనే రెండు నాలుకల ధోరణితో వైసీపీ ఎన్నికల బరిలోకి దిగింది.

ఈ నేపథ్యంలో కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో కూటమి vs వైసీపీ ముఖ్యంగా టీడీపీ vs వైసీపీ అన్నట్టుగా ఎన్నికల నామినేషన్ ప్రక్రియ నుంచి పోలింగ్ బూత్ వరకు కూడా రాజకీయం ఆయా పార్టీల క్యాడర్ దాడులతో రణరంగంగా మారింది. పులివెందుల, పుంగనూరు, తాడిపత్రి వంటి ప్రాంతాలల్లో స్థానిక ఎన్నికల వేడి రాష్ట్రం మొత్తాన్ని తాకింది.

ఇలా అర్నబ్, మురసు, అక్వాన్ తుఫాన్లు చల్లబరిచిన ఏపీ వాతావరణాన్ని స్థానిక ఎన్నికలతో కూటమి, వైసీపీ పార్టీలు కలిసి వేడెక్కించాయి. మరి ఆ వేడి ప్రభావం స్థానిక ఎన్నికల ఫలితాల విడుదలతో చల్లబడుతుందా? లేదా 2029 సార్వత్రిక ఎన్నికల వరకు కొనసాగుతుందా?

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Alias Rukmini Trailer: A Romance with an Unexpected Twist

Nithiin plays a different character in Alias Rukmini, directed by Murali Kanth Devasoth and produced…

10 minutes ago

World Bank Express Satisfaction with Amaravati

Amaravati's capital development has received positive feedback from international financial institutions. A joint team of…

26 minutes ago