
AP Local Elections: TDP Alliance Faces Seat-Sharing Challenge
కూటమి పార్టీల మద్య సీట్ల సర్దుబాట్ల ప్రక్రియ పూర్తయింది. తిరుపతి కోసం జనసేన, బిజేపి పట్టుబట్టినప్పటికీ చివరికి అది టీడీపికే దక్కింది.
వైసీపీకి ఈ సమస్య లేదు కనుక చకచక అభ్యర్ధులను ప్రకటిస్తోంది. రిజర్వేషన్లు ఖరారు కాక మునుపే నెల్లూరు మేయర్ అభ్యర్ధిగా ఆనం విజయ్ కుమార్ రెడ్డిని ప్రకటించిన వైసీపీ, ఇప్పుడు మరో ఆరు కార్పోరేషన్లకు మేయర్, 20 మున్సిపాలిటీలకు చైర్మన్, చైర్ పర్సన్లను ప్రకటించింది.
నేడో రేపో తిరుపతి, చిత్తూరు, అనంతపురం, విజయవాడ, గుంటూరు, కర్నూలు మేయర్ అభ్యర్ధులను, మిగిలిన మున్సిపాలిటీలకు చైర్మన్, చైర్ పర్సన్లను కూడా ప్రకటించబోతోంది.
అయితే ఒక పార్టీలో ఇలాంటి అవకాశాల కోసం సీనియర్ల మద్య నెలకొనే పోటీని అధినేతలు సులువుగా ‘విటో’ చేసి లేదా తర్వాత అవకాశం కల్పిస్తామని నచ్చజెప్పి నచ్చిన అభ్యర్ధిని ఎంపిక చేయవచ్చు.
కానీ కూటమిలో ముందుగా మూడు పార్టీల మద్య సీట్ల కోసం పోటీ ఏర్పడింది. దానిని పరిష్కరించుకున్నాక, మళ్ళీ ఇప్పుడు మూడు పార్టీలలో అంతర్గతంగా పోటీ పడుతున్న నేతలకు సర్ది చెప్పి వారిలో నుంచి ఒకరిని ఎంపిక చేయాల్సి ఉంటుంది.
ఈ రెండు ప్రక్రియలతోనే మూడు పార్టీలలో అసంతృప్తి జ్వాలలు ఎగసిపడుతుంటాయి. కనుక వాటిని చల్లార్చుకొని, మళ్ళీ అందరినీ కూడగట్టుకొని ఈ స్థానిక సంస్థల ఎన్నికలలో విజయం సాధించాల్సి ఉంటుంది. వాటికి ఇది కూడా మరో అగ్నిపరీక్ష వంటిదే.
ఒకవేళ వైసీపీ కూడా రెండు మూడు పార్టీలతో పొత్తులో ఉండి ఉంటే, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇలాంటి సందర్భంలో మిత్ర పక్షాలను ఎలా హ్యాండిల్ చేస్తారో? అనే ఆలోచనే చాలా ఆసక్తికరంగా ఉంటుంది కదా?
Anupama Parameswaran has been speaking about her painful past relationship for the last few months.…
Elon Musk has become the first person in history to reach a trillion-dollar net worth,…