Telugu

స్థానిక ఎన్నికలు …వైసీపీ సిద్ధమా.?

గత ఐదేళ్లు ఎన్నికలకు సిద్ధమా.? సిద్ధమా అంటూ ప్రత్యర్థి పార్టీల నేతల మీద గొంతులు చించుకున్న వైసీపీ నేతలు ఇప్పుడు స్థానిక ఎన్నికలు అడ్డుకునేందుకు సిద్ధమయ్యారు. కూటమి ప్రభుత్వం పై ప్రజలలో తీవ్ర వ్యతిరేకత, వచ్చేది మేమే, రప్ప రప్ప రాజకీయాలకు సిద్ధం అంటూ మొన్నటి వరకు నానా హంగామా చేసిన వైసీపీ ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలకు ఎందుకు వెనకడుగు వేస్తుంది.?

ఎదో ఒక కారణాన్ని అడ్డుగా చూపి ఎలా అయినా స్థానిక సంస్థల ఎన్నికలను అడ్డుకునేందుకు వైసీపీ న్యాయస్థానాలను ఎందుకు ఆశ్రయిస్తుంది. ఒక పక్క యుద్దానికి సిద్ధం కావాలంటూ పార్టీ నేతలకు ఆదేశాలు ఇచ్చిన జగన్ మరోపక్క ఆ యుద్దాన్ని ఆపాలంటూ న్యాయపోరాటాలు ఎందుకు చేస్తున్నట్టు.?

ADVERTISEMENT

పార్టీ అధినేతగా వైఎస్ జగన్ స్థానిక సంస్థల ఎన్నికలలో వైసీపీ గెలుపు భారం మొత్తం ఆ పార్టీ నేతల భుజాన వేసి తానూ తప్పుకున్నారు. గెలిస్తే క్రెడిట్ చోరీకి వెనకడుగు వెయ్యని జగన్ పార్టీ ఓడితే మాత్రం ఆ నేరాన్ని నేతల పై రుద్డేందుకు వీలుగా ఇప్పటికే హెచ్చరికలు జారీచేశారు.

సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ గెలిస్తే అది జగన్ మీద ప్రజలకున్న నమ్మకంగా ప్రచారం చేసుకున్న జగన్ అదే వైసీపీ ఓడితే మాత్రం అది ఈవీఎం ల పాపం అంటూ ఓటమి ఫలితాన్ని మాత్రం ఒక మిషన్ ఖాతాలో వేసేసారు. అలాగే ఇప్పుడు కూడా స్థానిక ఎన్నికలలో వైసీపీ విజయం సాధిస్తే దాని క్రెడిట్ తన ఖాతాలోకి, ఓడితే పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ ల ఖాతాలో వేసేందుకు సిద్ధమయ్యారు.

ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల గెలుపు వైసీపీ పార్టీ ఇంచార్జ్ ల రాజకీయ భవిష్యత్ పై ప్రభావం చూపనుంది. మరి వైసీపీ ఇంచార్జ్ లు అంత రిస్క్ తీసుకుని తమ తమ స్థానంలో వైసీపీ పార్టీ గెలుపు కోసం కూటమి పార్టీలతో రాజకీయ యుద్ధం చేసేందుకు సిద్ధంగా ఉన్నారా.?

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

CBN Sets November 15 Target for Local Body Polls

Andhra Pradesh Chief Minister N. Chandrababu Naidu has asked ministers to prepare for the upcoming…

34 minutes ago

KTR Couldn’t Save Paradise, Can Lokesh Save Ranabaali?

Political support for Telugu films is not new, but it often becomes a talking point…

54 minutes ago