
AP Municipal Elections: TDP-YSRCP Clashes in Punganur and Rayachoti
నేటి నుంచి మున్సిపల్ ఎన్నికలకు నామినేషన్స్ ప్రక్రియ ప్రారంభం అయ్యింది. అయితే తొలిరోజున నామినేషన్స్ వేసేటప్పుడే టీడీపి-వైసీపీ వర్గాల మద్య ఘర్షణలు, భౌతిక దాడులు, విధ్వంసం జరగడం దిగ్బ్రాంతి కలిగిస్తుంది.
అన్నమయ్య జిల్లాలోని పుంగనూరు, రాయచోటిలో రెండు పార్టీల అభ్యర్ధులు ఒకే సమయంలో నామినేషన్స్ వేసేందుకు బయలుదేరడంతో ఇరు వర్గాల మద్య తీవ్ర ఉద్రిక్తలు మొదలయ్యి చివరికి పరస్పరం దాడులు చేసుకున్నారు.
ఈ దాడులలో ఇరువర్గాలకు చెందినవారు గాయపడ్డారు. రాయచోటిలో కొన్ని వాహనాలకు నిప్పంటించడంతో పరిస్థితి అదుపు తప్పింది. వెంటనే పోలీసులు లాఠీఛార్జి చేసి ఇరువర్గాలను చెదరగొట్టారు.
ఈ స్థాయిలో ఘర్షణలు, దాడులు, విధ్వంసం చూస్తున్నప్పుడు ఇవి మున్సిపల్ ఎన్నికలా లేక అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలా? అనే సందేహం కలుగుతుంది.
అయితే ఇందుకు పూర్తిగా వైసీపీ లేదా టీడీపిని తప్పు పట్టలేము. ఎందుకంటే ఒంటి చేత్తో ఎవరూ చప్పట్లు కొట్టలేరు కనుక!
కానీ ఈ ఎన్నికలలో భౌతిక దాడులు, అల్లర్లు, విధ్వంసం జరిగితే ఎవరికి నష్టం? ఎవరికి చెడ్డపేరు? అని ఆలోచిస్తే కూటమి ప్రభుత్వానికే తప్ప వైసీపీకి కాదని చెప్పవచ్చు. వైసీపీ ప్రభుత్వాన్ని వేలెత్తి విమర్శించగలదు.
రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ అయిపోయిందని, శాంతి భద్రతలు క్షీణించాయని వాదిస్తూ గవర్నర్, రాష్ట్రపతికి వైసీపీ పిర్యాదులు కూడా చేయగలుగుతుంది.
కనుక కూటమి ప్రభుత్వం ఈ స్థానిక సంస్థల ఎన్నికలు సజావుగా జరిపించగలిగితే అదే తొలి విజయం. కనుక వైసీపీతో ఇలా చేతులు కలిపి చప్పట్లు కొట్టే ప్రయత్నం కూటమి పార్టీలు మానుకోవడం చాలా అవసరం.
కొమ్ములు తిరిగిన టీడీపి పరిస్థితే ఈవిధంగా ఉన్నప్పుడు, వైసీపీ ధాటికి తట్టుకోలేని జనసేన పరిస్థితి ఏవిధంగా ఉంటుందో?
Ranbir Kapoor and Yash starrer mythological film Ramayana Part 1 will be hitting the screens…
Mitchell Starc's participation in IPL 2027 remains uncertain as Australia prepare for a demanding international…