Telugu

కనుక ఏపీలో ముందస్తు లేన్నట్లే… పాపం ప్రజలు!

కేంద్ర ఎన్నికల కమీషన్‌, ఏపీ, తెలంగాణలతో సహా దేశంలో 9 రాష్ట్రాల శాసనసభ ఎన్నికల నిర్వహణకు, ఆ తర్వాత లోక్‌సభ ఎన్నికల నిర్వహణకు కసరత్తు ప్రారంభించింది. ఇప్పటికే కమీషన్‌ సభ్యులు గత నెల హైదరాబాద్‌కు వచ్చి ఎన్నికల నిర్వహణ ఏర్పాట్ల గురించి చర్చించి, రిటర్నింగ్ అధికారుల జాబితా సిద్దం చేస్తే వారికి శిక్షణ ఇస్తామని చెప్పి వెళ్ళారు. జూన్ నెల నుంచి ఈవీఎంలన్నీ సరిగ్గా పనిచేస్తున్నాయో లేదో పరీక్షించి అవసరమైనవాటికి మరమత్తులు చేయాలని ఆదేశించారు.

ADVERTISEMENT

కేసీఆర్‌ నిరుడు డిసెంబర్‌లో ముందస్తు ఎన్నికలకు వెళ్ళడం వలన డిసెంబర్‌లోగానే ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. మూడు నెలల ముందు షెడ్యూల్, నోటిఫికేషన్ వెలువడుతుంది. అంటే సెప్టెంబర్‌-అక్టోబర్‌ మద్య ఎప్పుడైనా ఎన్నికల గంట మ్రోగవచ్చన్న మాట!

ఇక ఏపీ విషయానికి వస్తే, గత ఎన్నికలలో వైసీపీకి కొన్ని రాజకీయ శక్తులు సహకరించడం, కొన్ని అంశాలు అనుకూలించడం, టిడిపి ప్రభుత్వ రాజకీయ తప్పిదాలు లేదా గెలుస్తామనే ధీమా కారణంగా జగన్‌ సర్కార్ భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చింది.

అయితే ఆ ఎన్నికల నాటికి టిడిపికి వ్యతిరేకంగా క్రమంగా పరిస్థితులు ఏవిదంగా మారాయో, ఇప్పుడు అదేవిదంగా జగన్ సర్కారుకు కూడా పరిస్థితులు మారుతుండటం అందరూ చూస్తూనే ఉన్నారు. కనుక పరిస్థితులు చేయి దాటిపోక మునుపే ముందస్తు ఎన్నికలకి వెళ్ళవచ్చనే ఊహాగానాలు వినిపించాయి.

కానీ ముందస్తుకు వెళ్ళి ఓడిపోతే అనవసరంగా ఏడాది పదవీకాలం వదులుకొన్నట్లవుతుంది కనుక అవకాశం ఉన్నంతవరకు అధికారంలో కొనసాగడమే బెటర్ అని వైసీపీ సీనియర్ నేతలు లేదా ఐప్యాక్ సలహా ఇచ్చి ఉండవచ్చు. కనుక ఆ ఆలోచన విరమించుకొంది. కేంద్ర ఎన్నికల కమీషన్‌ తాజా ప్రకటన దీనిని ధృవీకరిస్తోంది.

తెలంగాణ శాసనసభ ఎన్నికలలో పోటీ చేయాలనుకొంటున్న పార్టీలు జూలై 17 తర్వాత, ఏపీతో సహా మిగిలిన 7 రాష్ట్రాల శాసనసభ లేదా లోక్‌సభ ఎన్నికలలో పోటీ చేయాలనుకొంటున్న పార్టీలు డిసెంబర్‌ 12 తర్వాత ఉమ్మడి ఎన్నికల గుర్తుల కోసం దరఖాస్తు చేసుకోవాలని కేంద్ర ఎన్నికల కమీషన్‌ తాజా ప్రకటన ద్వారా కోరింది. అంటే ఏపీలో ముందస్తు ఎన్నికలు జరుగబోవడం లేదని స్పష్టం అయిందనుకోవచ్చు.

వైసీపీకి రెండో ఛాన్స్ లభించదనే స్పష్టమైన సంకేతాలు కనబడుతున్నప్పుడు, అనూహ్యంగా లభించిన మొదటి ఛాన్స్‌ని పూర్తిగా సద్వినియోగించుకోవాలనుకోవడం చాలా తెలివైన నిర్ణయమే. అయితే ఆలోగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం మరింత దివాళా అవుతుంది. ప్రజలే ఏరికోరి వైసీపీని తెచ్చుకొన్నారు కనుక ఆ భారం ప్రజలే భరించక తప్పదు. అది వేరే విషయం.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Sharmila Slams TDP and YSRCP Over Violence During AP Municipal Elections

Political tensions are rising in Andhra Pradesh as clashes continue during the municipal election nomination…

13 minutes ago

Varanasi Release in Doubt? Prabhas’ Fauzi May Benefit

SS Rajamouli's Varanasi is one of the most ambitious projects in Indian cinema, with Mahesh…

42 minutes ago