
కానీ అధికార పార్టీ నేతలు అన్నా క్యాంటీన్లపై దాడులు చేయవచ్చు. ప్రతిపక్ష నేతలపై ఇనుప రాడ్లతో దాడులు చేసి గాయపరచవచ్చు. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు వంటివారు మరో అడుగు ముందుకు వేసి హత్య చేసి శవాన్ని డోర్ డెలివరీ కూడా ఇస్తారు. కానీ వాటిపై పోలీసుల స్పందన చాలా భిన్నంగా ఉంటుంది.
అన్నమయ్య జిల్లా తంబళ్ళపల్లె నియోజకవర్గంలోని పెద్దతిప్ప సముద్రంలో బస్టాండ్ వద్ద టిడిపి నాయకుడు శంకర్ యాదవ్ అధ్వర్యంలో గురువారం అన్నా క్యాంటీన్ పెట్టి పేదలకు అన్నదానం చేయాలనుకొన్నారు. కానీ పోలీసులు అనుమతించకపోవడంతో, ఓ కార్యకర్త ఇంటివద్దే అన్నీ వండి సిద్దం చేసుకొని వాటితో బస్టాండ్ వద్దకు చేరుకొన్నారు. కానీ అప్పటికే మదనపల్లి డీఎస్పీ రవి మనోహరాచారి, ఆరుగురు ఎస్ఐలు, 50 మంది పోలీసులు అక్కడికి చేరుకొని టిడిపి నేతలను అన్నదానం చేయకుండా అడ్డుకొన్నారు. ఏమంటే అన్నదానం కార్యక్రమాన్ని నిరసిస్తూ వైసీపీ కార్యకర్తలు సమీపంలోనే ఆందోళన చేస్తున్నారట! కనుక ఇరువర్గాలు గొడవ పడిసతే శాంతి భద్రతల సమస్య తలెట్టుంది కనుక ఆ ప్రాంతంలో కర్ఫ్యూ విధించామని డీఎస్పీ రవి మనోహరాచారి తెలిపారు. కనుక అక్కడ అన్నదానం కార్యక్రమం నిర్వహించడానికి వీల్లేదని చెప్పారు.
కానీ టిడిపి నేతలు అన్నదానం కార్యక్రమం కొనసాగిస్తుండటంతో పోలీసులు, ఆ గిన్నెలు, ఆహార పదార్ధాలను బలవంతంగా వ్యానులో వేసుకొని పోలీస్ స్టేషన్కు పట్టుకుపోయారు. దీంతో ఆన్నదాన కార్యక్రమంలో నిలిచిపోయింది. ఆకలితో వచ్చిన నిరుపేదలు పోలీసులను, వైసీపీ నేతలను తిట్టుకొంటూ వెళ్ళిపోయారు.
టిడిపి నేతలు అన్న దానం చేస్తే వారికి ప్రజలలో మంచి పేరు వస్తుందని వైసీపీ గట్టిగా నమ్ముతున్నప్పుడు, వైసీపీ నేతలు కూడా పోటీగా టిడిపి కంటే గొప్పగా అన్నదాన కార్యక్రమాలు నిర్వహించవచ్చు కదా? కానీ అమ్మ పెట్టదు… వేరొకరిని పెట్టనీయదన్నట్లు వైసీపీ నేతలు పేదలకు అన్నం పెట్టలేరు టిడిపి నేతలనీ పెట్టనీయరు.
పోలీసులు, మున్సిపాల్ సిబ్బందిని అడ్డుపెట్టుకొని టిడిపి నేతలని అన్నదానం చేయకుండా అడ్డుకొన్నామని వైసీపీ నేతలు ఇప్పుడు గొప్పగా భుజాలు చరుచుకోవచ్చు కానీ రేపు ఎన్నికలలో టిడిపి నేతలు దీని గురించి నిలదీస్తే ఏం సమాధానం చెప్తారు?
Prabhas is heading towards another massive box-office clash, with Sandeep Reddy Vanga's Spirit scheduled to…
వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి నేడు తాడేపల్లి ప్యాలస్లో ప్రెస్మీట్లో మున్సిపల్ ఎన్నికల నామినేషన్స్ ప్రక్రియలో టీడీపి గూండాయిజం చేసిందని…