Telugu

మిగులు విద్యుత్ దశకు ఏపీ, విద్యుత్ సంక్షోభంలో తెలంగాణ!

రాష్ట్ర విభజన తర్వాత పదేళ్ళపాటు తెలంగాణ రాష్ట్రం శరవేగంగా అభివృద్ధి చెందగా, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి బ్రేకులు వేసినట్లు ఐదేళ్ళపాటు అభివృద్ధి నిలిచిపోయింది. అయితే రెండు రాష్ట్రాలలో ప్రభుత్వాలు మారడంతో పరిస్థితులు కూడా మారాయి.

ADVERTISEMENT

ఇప్పుడు సిఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్‌ అన్ని రంగాలలో దూసుకుపోతుంటే, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్‌-బీఆర్ఎస్‌ పార్టీల రాజకీయాలలో నలిగిపోతోంది.

పాలకుల లక్షల కోట్ల అవినీతి కథలు, ఫామ్‌హౌసులు, వందల కొద్దీ ఎకరాలు, వందలు వేలకోట్ల విలువగల వారి ఆస్తుల కబుర్లు వినిపిస్తున్నాయి.

ఇక తెలంగాణ ఏసీబీ అధికారులు వలలో రోజుకో అవినీతి అధికారి చిక్కుతూనే ఉన్నారు. ఓ పక్క సింగరేణిలో అవినీతి కథలు వినిపిస్తుంటే, మరోపక్క తెలంగాణ రాష్ట్రం మళ్ళీ భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి.

కేసీఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇక ఎన్నటికీ కంటి రెప్పపాటు కూడా రాష్ట్రంలో విద్యుత్ కోతలు ఉండవని గొప్పగా చెప్పుకునేవారు. కానీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ విద్యుత్ కోతలు మొదలయ్యాయి.

ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్‌ వరుసగా సాగునీటి ప్రాజెక్టులు ప్రారంభోత్సవాలు జరుగుతుంటే, మరో పక్క సోలార్, స్టోరేజ్‌ విద్యుత్, విండ్ మిల్, హైడల్ ప్రాజెక్టులు వరుసగా అందుబాటులోకి వస్తున్నాయి. వీటితో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి భారీగా అదనపు విద్యుత్ అందుబాటులోకి వస్తోంది.

తాజాగా పోలవరం జిల్లాలోని పొల్లూరు వద్ద నిర్మిస్తున్న జల విద్యుత్ కేంద్రంలోని 5వ యూనిట్ నవంబర్‌ నుంచి అందుబాటులోకి రానుంది. దీనిని 460 మెగావాట్స్ సామర్ధ్యంతో నిర్మిస్తున్నారు.

దీని తర్వాత వచ్చే ఏడాది మార్చి నెలలో 230 మెగావాట్స్ సామర్ధ్యం కలిగిన 6వ యూనిట్ కూడా అందుబాటులోకి వస్తుంది.

అప్పుడు పొల్లూరు జల విద్యుత్ కేంద్రం మొత్తం 690 మెగావాట్స్ సామర్ధ్యంతో శ్రీశైలం జలవిద్యుత్ ప్రాజెక్టు (770 మెగావాట్స్) తర్వాత రెండో స్థానంలో నిలువబోతోంది.

పొల్లూరు ప్రాజెక్టు ద్వారా రాష్ట్రానికి అదనంగా 690 మెగావాట్స్ లభించబోతోంది. ఇది కాక సోలార్, విండ్ మిల్, స్టోరేజ్‌ విద్యుత్, ప్రజలు ఇళ్ళపై ఏర్పాటు చేసుకుంటున్న సోలార్ పలకల ద్వారా రాష్ట్రానికి విద్యుత్ లభిస్తుంది.

కనుక ఇకపై ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి కొరత ఉండదని భావించవచ్చు. అవసరమైతే తెలంగాణతో సహా ఇరుగు పొరుగు రాష్ట్రాలకు కూడా విద్యుత్ సరఫరా చేయగల స్థితికి ఆంధ్రప్రదేశ్‌ చేరుకోబోతోంది.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Anirudh’s Music Sparks Debate: Jailer 2 vs The Paradise

Anirudh Ravichander has established himself as one of the leading music composers in Indian cinema.…

11 minutes ago

గాదె సాయికృష్ణ కేసు సీబీఐకి.. సమంజసమే!

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కస్టడీ మరణం కేసులో ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు నేడు తీర్పు వెలువరించింది. ఈ…

34 minutes ago