
ముఖ్యమంత్రి గారి ఇక్కడ ముచ్చట్లు ఏమిటి అంటే… నేను నిన్నే చెప్పా… ఒక గంట అని చెప్పి సాక్షిలో వస్తుందని, అలాగే చర్చలు కూడా బాగా జరిగాయని, అన్నీ కూడా వచ్చాయి, కానీ “ముఖచిత్రమే బాగా వీక్” ఉంది, అది మనం ఊహించిందే, కాకపోతే 20 నిముషాలు లోపల ఉంటారని అనుకున్నాను, నాకు అందిన సమాచారం ప్రకారం, నాకు కాస్తో కూస్తో రిజనబుల్ నెట్ వర్క్ ఉంది కాబట్టి చెప్తున్నానని అన్నారు.
హెల్త్ రివ్యూలో ప్రధానమంత్రి గారు ఉన్నందు వలన చాలా తక్కువ సమయమే దొరికిందని, కేవలం ఒక 10 నిముషాలు అక్కడ ఉన్నట్టు, రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై ఒక వినతి పత్రం ఇచ్చినట్లుగా తెలిసింది. ముందు ఈయనకు అప్పాయింట్మెంట్ దొరికింది, పది నిముషాలు అయినా కూడా, అది కూడా సంవత్సరం తర్వాత, ఆంధ్రులందరూ సంతోషించాల్సిన విషయమని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
గతంలో ప్రధానమంత్రి గారిని ఏపీ సీఎం కలిసినపుడు హక్కుల సాధన పేరుతో జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యల వీడియోను ఈ సందర్భంగా ప్లే చేసి చూపించారు. కాలం తమాషా అదే అని, ఒకప్పుడు మనం మాట్లాడిన వ్యాఖ్యలే ఇపుడు మనకు కొట్టుకొస్తున్నాయని, ఉత్తర కుమారుడంటూ నాడు చంద్రబాబుని అన్న జగన్, నేడు అదే పాత్రను పోషించాల్సి వచ్చిందని ఆర్ఆర్ఆర్ తనదైన శైలిలో చెప్పుకొచ్చారు.
ఎంతవరకు మనం వినతిపత్రం ఇచ్చాం, మనం చర్చించాం అని చెప్పడం తప్ప, మనం అడిగిన దానికి వాళ్ళ స్పందన ఏమిటన్నది చెప్పట్లేదు. కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ కు ఎదురుగా జగన్ ఏ విధంగా కూర్చున్నారో కూడా ఈ సందర్భంగా ఆర్ఆర్ఆర్ కూర్చుని, కనీసం కేంద్రమంత్రి దగ్గర కూడా ఫ్రీగా కూర్చోలేని పరిస్థితి నెలకొందని వాపోయారు.
25 ఎంపీ స్థానాలు ఇస్తే కేంద్రం మెడలు వంచుతాం అని చెప్తే 28 ఎంపీలు ఇచ్చారని, కానీ ఎవరి మెడలు వంచారు? అంటే మన మెడలే వంచామని ఏపీ సీఎం జగన్ తీరును ఎండగట్టారు. ఇప్పుడు ఫ్లైట్ ఎక్కి వెళ్లిపోయిన తర్వాత అయినా మంచి పరిపాలన ప్రారంభించి, కొంపలో కూర్చోకుండా చక్కగా ఆఫీస్ కు వెళ్లి పనిచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లుగా ఆర్ఆర్ఆర్ తెలిపారు.
The pre-release event of Ramayana was held in Hyderabad, where a large crowd gathered for…
Nani and OG director Sujeeth have teamed up for Bloody Romeo, a stylish action film…