Telugu

ఆంధ్రాకు వరుస తుఫానులు… ఈ నీటిని పొదుపు చేసుకోగలిగితే?

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి వరుస తుఫానులు పెద్ద సమస్యగా మారాయి. నైరుతి బంగాళాఖాతం నుంచి పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు ద్రోణి కొనసాగుతుండటంతో రాష్ట్రంలో రాబోయే నాలుగు రోజుల పాటు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేసింది.

ఈరోజు తిరుమలలో హఠాత్తుగా భారీ వర్షం కురిసింది. అలాగే నెల్లూరు జిల్లాలో ఈరోజు ఉదయం నుంచి కుండపోతగా వాన కురుస్తూనే ఉంది. నిన్న (మంగళవారం) మధ్యాహ్నం 3 గంటల వరకు నెల్లూరు జిల్లా కొండాపురంలో అత్యధికంగా 39.2, కావలిలో 34.2 మిల్లీమీటర్ల వర్షం కురిసింది.

ADVERTISEMENT

ప్రకాశం జిల్లా కొత్తపట్నంలో 34.4, మారెళ్ళలో 33.5, మార్కాపురం జిల్లా త్రిపురాంతకంలో 27.9 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.

ఈ ద్రోణి ప్రభావంతో రాబోయే నాలుగు రోజులు పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కోనసీమ, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, శ్రీసత్యసాయి, వైఎస్సార్ కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇతర జిల్లాల్లోనూ చెదురుమదురుగా వర్షాలు పడవచ్చని వాతావరణ శాఖ తెలియజేసింది.

ఈ అకాల వర్షాలను, వాటితో జరిగే ఆస్తి, పంట నష్టాన్ని ఎలాగూ ఆపలేము. కనుక ప్రాణ నష్టం జరగకుండా ప్రభుత్వం అవసరమైన ముందస్తు చర్యలు చేపడుతూ ఉంటుంది.

నగరాలు, పట్టణాలు, పల్లెలు అనే తేడా లేకుండా కురుస్తున్న ఈ వర్షపు నీరు ఎక్కడికక్కడ రోడ్లపై నిలిచిపోతుంది. లేదా మురికి కాలువల్లో కలిసిపోతుంది. దాంతో కాలువలు పొంగి ప్రజలకు నరకం చూపిస్తుంటాయి.

కనుక ఆయాచితంగా లభిస్తున్న ఈ వర్షపు నీటిని సేకరించేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా కాలువలు, అండర్‌గ్రౌండ్ పైప్‌లైన్లు ఏర్పాటు చేసి, చెరువులు, భూగర్భ ట్యాంకులు, ఇంకుడు గుంతలకు తరలించగలిగితే ఇక ఎన్నటికీ నీటి కొరత ఉండదు.

హైదరాబాద్‌లో రోడ్లపై నీళ్ళు ఎక్కువగా నిలిచే ప్రాంతాలను గుర్తించి, సమీపంలో భారీ భూగర్భ ట్యాంకులు నిర్మించింది అక్కడి ప్రభుత్వం. ఆంధ్రాలో కూడా వర్షపు నీటిని ఇలా ఒడిసిపట్టి నిల్వ చేయగలిగితే ఆ నీటిని అవసరమైనప్పుడు వాడుకోవచ్చు. లేదా భూగర్భ జలాలను పెంచవచ్చు. ఇంకా ఇతర అవసరాలకు కూడా ఆ నీటిని ఉపయోగించుకోవచ్చు కదా?

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

AP High Court Restricts Court Videos, Audio and Screenshots

The Andhra Pradesh High Court has issued directions restricting the unauthorised recording and broadcasting of…

17 minutes ago

Tollywood’s Big Four: Why So Scared to Escape the Trap?

Tollywood legends Chiranjeevi, Balakrishna, Nagarjuna and Venkatesh have spent decades entertaining Telugu audiences. They have…

47 minutes ago