
2019 కి ముందు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విభాగంలో ఎక్కడా కనిపించని సచివాలయ వ్యవస్థ వైసీపీ ప్రభుత్వ హయాంలో నాటి సీఎం జగన్ నాయకత్వాన పుట్టుకొచ్చింది. ఒక నిర్దిష్టమైన విధి విధానాలు లేకుండా, గతంలో ఉన్న గ్రామ సర్పంచ్, మున్సిపాలిటీ పభుత్వ విభాగాలకు సమాంతరంగా నిర్మించిన ఈ వ్యవస్థ పై స్పష్టమైన ఫ్రెమ్ వర్క్ లేదు.
ఉద్యోగుల అర్హత నుంచి వారి ప్రమోషన్స్ వరకు ఏ ప్రక్రియ లోను నాటి వైసీపీ స్పష్టమైన వైఖరిని అవలంభించలేదు. కేవలం ఉపాధి కల్పించాం అన్న ఒకేఒక్క నినాదంతో ఒకపక్క వాలంటీర్ వ్యవస్థను మరోపక్క సచివాలయం వ్యవస్థను సృష్టించి వారికి కల్పించే ఉద్యోగ భద్రత విషయాన్ని మాత్రం గాలికొదిలేసింది.
దీనితో నాటి వాలంటీర్ వ్యవస్థ లాగానే ఈ సచివాలయం వ్యవస్థ కూడా కనుమరుగు కాక తప్పదా అన్న సందేహాలు కలిగినప్పటికీ కూటమి ప్రభుత్వం సచివాలయ వ్యవస్థను కొనసాగిస్తుంది. అయితే కాలక్రమేణా సచివాలయం ఉద్యోగుల పని భారం పెరుగుతూ వస్తుందని,
అయితే తమకు పనితగ్గ వేతనం మాత్రం దక్కడం లేదనే డిమాండ్ల తో స్వర్ణగ్రామ, వార్డు సచివాలయం ఉద్యోగులు ఛలో విజయవాడ కు పిలుపునివ్వడం, అక్కడ పోలీసులకు సచివాలయం ఉద్యోగులకు మధ్య తీవ్ర ఉద్రికత్త వాతావరణం ఏర్పడడంతో ఈ వివాదం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
సచివాలయం ఉద్యోగులు ప్రభుత్వం ముందు ఉంచిన డిమాండ్లలో ముఖ్యమైనవి…
ఇంక్రిమెంట్లు : ప్రొబేషన్ పూర్తైన తర్వాత రావాల్సిన రెండవ విడత వార్షిక ఇంక్రిమెంట్లు వెంటనే మంజూరు చెయ్యాలని,
ప్రొబేషన్ బకాయిలు : గతంలో నిలిచిపోయిన సుమారు 9 నెలల ప్రొబేషన్ కాలపు జీతాల బకాయిలు తక్షణమే విడుదల చెయ్యాలని,
కనీస బేసిక్ పే : సచివాలయ ఉద్యోగులకు కనీస ప్రాధమిక వేతనం కింద రూ . 30,000 చెల్లించాలని,
ప్రమోషన్లు : అర్థులైనా అన్ని కేడర్ల ఉద్యోగులకు తగిన పదోన్నతుల ఛానెల్ ఏర్పాటు చేసి ప్రమోషన్స్ కల్పించాలని,
ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కీమ్ : ఇతర ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే తమకు కూడా ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కీమ్ వర్తింపచేయాలని….ఇలా సచివాలయ ఉద్యోగులు అనేకరకమైన డిమాండ్ల సాధనకై ప్రభుత్వం పై పోరాటానికి సిద్ధమయ్యారు.
సచివాలయం ఉద్యోగుల డిమాండ్లు ఇలా ఉంటే మరోపక్క ప్రభుత్వ వాదన…
స్వర్ణగ్రామ, వార్డ్ సచివాలయం ఉద్యోగుల డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరిస్తున్నా ఉద్యోగులు ఎందుకు ఆందోళనకు దిగుతున్నారో అంటూ మంత్రి డిబివి స్వామి మీడియా ముందుకొచ్చారు. నాటి వైసీపీ ప్రభుత్వం అనాలోచితంగా ఏర్పాటు చేసిన సచివాలయ వ్యవస్థను స్టీమ్ లైన్ చేసుకుంటూ వస్తున్నామని, ఇప్పటికే 15 వేలమందికి పైగా ప్రమోషన్స్ ఇచ్చామని, ఈ వ్యవస్థ ప్రభుత్వానికి ఆర్థిక భారమే అయినప్పటికీ వారి సమస్యల పరిష్కారం కోసం నిత్యం శ్రమిస్తున్నామని, గతంలో రూ .15 వేలకు రెండు సంవత్సరాలు ఉద్యోగం చేసి ఏం మాట్లాడకుండా ఇప్పుడు కూటమి ప్రభుత్వం పై ఒత్తిడి తేవడం ఎంతవరకు సమంజసం అంటూ నిలదీసారు మంత్రి డిబివి స్వామి.
అయితే సచివాలయం ఉద్యోగులు సమస్యలు అంటూ రోడ్డున పడడానికి, ప్రభుత్వం తాము చేయగలిగిందంతా చేస్తున్నామంటూ చెప్పడానికి మధ్య వైసీపీ సృష్టించిన వ్యవస్థలో ఉన్న అసంపూర్ణ ప్రక్రియే ముఖ్య కారణంగా కనిపిస్తుంది.
Ravi Teja’s Irumudi has wrapped up its theatrical run with an outstanding worldwide gross of…
Natural Star Nani’s latest outing The Paradise is performing well at the box office. Despite…