Telugu

పేర్ని నాని… ఓ బ్లాక్ టికెట్ల మంత్రి..!

ఏపీలో ఇప్పటికే బెట్టింగ్ మంత్రి ఉన్నారు, బెంజ్ మంత్రి ఉన్నారు, ఇప్పుడు కొత్తగా బ్లాక్ టికెట్ల మంత్రి కూడా వచ్చారని పేర్ని నానిని విమర్శించారు టిడిపి నేత పట్టాభి. సినిమా టికెట్ల వ్యాపారాన్ని గుప్పెట్లో తీసుకుని భవిష్యత్తులో ఏ విధంగా బ్లాక్ లో టికెట్లు అమ్మాలి? ఆ రకంగా ఎంత దోచుకోవాలి? దీనికి అధిపతిగా పేర్ని నానిని ముఖ్యమంత్రి నియమించారని ఆరోపణలు చేసారు.

ఇప్పటికే మద్యం, ఇసుక గుప్పెట్లో ఉన్నాయి గనుక, నేడు బ్లాక్ టికెట్ల వ్యాపారం కూడా చేయాలని పేర్ని నానికి సినిమాటోగ్రఫీ శాఖను కూడా కేటాయించారని అన్నారు. ఔటర్ రింగ్ రింగ్ రోడ్డుకు, బైపాస్ ప్రాజెక్ట్ కు ఈ బ్లాక్ టికెట్ల మంత్రికి తేడా తెలియదని దుయ్యబట్టారు. మీడియా ముందుకు వచ్చే ముందు విషయ పరిజ్ఞానం లేకుండా, తాడేపల్లి స్క్రిప్ట్ ను చదువుతున్నారని ఆరోపించారు.

ADVERTISEMENT

నిశాని బ్యాచ్ అన్న విషయం తెలుసని, బ్లాక్ టికెట్లు అమ్ముకునే ఉద్దేశంలో ఉన్న మీకు ఇతర విషయాలు ఏవీ ఎక్కడం లేదని, ఔటర్ రింగ్ రోడ్డు గురించి నేను చెప్తాను వినమంటూ 189 కిలోమీటర్ల పరిధి ఔటర్ రింగ్ రోడ్డు గురించి సమగ్రంగా చదివి వినిపించారు పట్టాభి. ఈ ప్రాజెక్ట్ నిమిత్తం ఏ ప్రాంతంలో ఎంతెంత భూమి అవసరమో కూడా స్పష్టంగా చెప్పిన నివేదికను అనర్గళంగా చెప్పారు.

గూగుల్ మ్యాప్ లో గీతలు గీసిన ప్రాజెక్ట్ కాదని పేర్ని నాని వ్యాఖ్యలను తిప్పికొట్టారు పట్టాభి. ఇంత సవివరంగా డిజైన్ చేసిన ప్రాజెక్ట్ ను పిచ్చి గీతలుగా అభివర్ణించడంపై తీవ్రంగా మండిపడ్డారు. ఈ ఔటర్ రింగ్ రోడ్డునే కాదు, అమరావతికి ఇన్నర్ రింగ్ రోడ్డును కూడా డిజైన్ చేశామని, 98 కిలోమీటర్ల పరిధి ఉండేలా తీర్చిదిద్దామని పేర్ని నాని చేసిన విమర్శలను పూర్తి స్థాయిలో తిప్పికొట్టారు పట్టాభి.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Bigg Boss: Sudheer Comes Out Of Syllabus For Thrigun

The nominations in the second week of the Bigg Boss house began on an interesting…

2 hours ago

Venky’s AK47: Trivikram Finally Cleared One Big Doubt?

A Venkatesh and Trivikram combination has been on the wish list of Telugu audiences for…

2 hours ago