
రాష్ట్ర విభజన సందర్భంగా అధికారాల నుంచి అప్పుల వరకు ఎదురయ్యే సమస్యల పరిష్కారం కోసం 2014లో పునర్ వ్యవస్థీకరణ చట్టంలో 107 సెక్షన్ ను పెట్టారు. అయితే వాటి అమలులో సమస్యలు, గందరగోళాన్ని రాష్ట్రపతి తన స్వీయ విచక్షణాధికారాన్ని ఉపయోగించి పరిష్కరించవచ్చంటూ సెక్షన్ 108ను చేర్చారు. నిజానికి చట్టం అమలులో ఎదురయ్యే ఇబ్బందులను పరిష్కరించడానికి ఓ సెక్షన్ ను చేర్చడం బ్రిటిష్ హయాం నుంచి ఆనవాయితీగా వస్తోంది. మూడేళ్లలో ఈ సెక్షన్ ఇప్పటి వరకు మూడు సార్లు మాత్రమే ఉపయోగిపడింది.
పోలవరం ముంపు మండలాలు, తెలంగాణ శాసనమండలికి శాసనసభ కోటా, స్థానిక సంస్థల నియోజకవర్గాల విషయం… వంటి అంశాలలో రాష్ట్రపతి తన విచక్షణాధికారాన్ని ఉపయోగించి సమస్యలను పరిష్కరించారు. అయితే జూన్ 2తో ఈ సెక్షన్ మూడేళ్ల కాలపరిమితి ముగిసిపోతుంది. ఈ క్లాజు ఉన్నప్పటికీ ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న పలు సమస్యల పరిష్కారం విషయంలో కేంద్రం అంటీ ముట్టనట్టు వ్యవహరిస్తోంది. ఇక ఈ క్లాజు కాలపరిమితి ముగిసిపోయిన తర్వాత ఏమిటన్నదే ఇప్పుడు రెండు రాష్ట్రాల మధ్య ఉన్న ప్రశ్న.
Following the failure of Kara, Dhanush is currently starring as the lead in Om directed…
#Romanchakam Review: Thin Story, Patchy Laughs Romanchakam has a wafer-thin story and relies heavily on…