
తాత్కాలిక సచివాలయంలో భాగంగా సీఎం కార్యాలయం సహా, ఐదు కార్యాలయాలకు ఈ నెలాఖరు నాటికి శ్లాబ్ ను పూర్తి చేయాలని ప్రభుత్వం గడువు విధించింది. అయితే ఈ గడువు కంటే దాదాపు 20 రోజులు ముందుగానే సదరు పనిని కంపెనీలు పూర్తి చేయడం విశేషం. ఆధునిక యంత్రాలతో పిల్లర్లను అనుకున్న గడువు కంటే ముందుగానే కంపెనీలు ఏర్పాటు చేశాయి.
మంగళవారం రాత్రి 10 గంటల సమయంలో సీఎం కార్యాలయానికి శ్లాబ్ ను వేసే ప్రక్రియను మొదలుపెట్టిన కంపెనీలు, బుధవారం ఉదయం 9 గంటల సమయానికల్లా సదరు పనిని పూర్తి చేశాయి. అంటే… కేవలం 11 గంటల సమయంలో 10 వేల చదరపు అడుగుల మేర విస్తీర్ణం కలిగిన సీఎం కార్యాలయం శ్లాబ్ ను దిగ్విజయంగా పూర్తి చేశాయి. ఇదే వేగంతో పనులు కొనసాగితే జూన్ నాటికి తాత్కాలిక సచివాలయం ఏర్పాటు కావడం పెద్ద కష్టం కాకపోవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఫోక్ సాంగ్ డ్యాన్సర్లు ఈశ్వర్ సాయి, మాధురి రాథోడ్ వేములవాడలోని ఓ హోటల్ గదిలో ఉన్నప్పుడు, ఈశ్వర్ సాయి భార్య…
కొన్నిసార్లు భ్రమలకు, వాస్తవాలకు తేడా కనిపిస్తున్నా భ్రమలనే ఇష్టపడుతుంటారు. ఎందుకంటే వాస్తవాలు ఎప్పుడూ చేదుగానే ఉంటాయి. భ్రమలు మాత్రం మనం…