Telugu

ఈ పన్నులు, జరిమానాల బాదుడు ఏమిటి జగన్‌ మహాప్రభో!

శుక్రవారం విజయవాడలో వాణిజ్య సలహా కమిటీ (ట్రేడ్ అడ్వైజరీ కమిటీ) సమావేశం జరిగింది. దీనికి ముఖ్య అతిధిగా రాష్ట్ర ఆర్ధికమంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి, వాణిజ్య శాఖ ఉన్నతాధికారులు, పారిశ్రామిక వేత్తలు హాజరయ్యారు. సాధారణంగా ఇటువంటి సమావేశాలలో వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు మంత్రిగారిని, ముఖ్యమంత్రిని, ప్రభుత్వాన్ని పొగుడుతూ వారిని ప్రసన్నం చేసుకొని ఏవో వరాలు లేదా రాయితీలు పొందాలని ప్రయత్నిస్తుంటారు. అదేవిదంగా మంత్రులు, ప్రజాప్రతినిధులు తమ ప్రభుత్వం గొప్పలు చెప్పుకొంటుంటారు. కానీ నిన్న జరిగిన ఈ సమావేశం చాలా వాడివేడిగా సాగింది. వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు వరుసగా మంత్రిని, అధికారులను కడిగి పడేశారు.

“ప్రభుత్వానికి ఆదాయం లేకపోతే వాణిజ్యపన్ను శాఖ అధికారులు ప్రతీ 15 రోజులకోసారి మామీద పడి డబ్బు పిండుకొంటారా? ఏదో వంకతో జరిమానాలు విధిస్తూనే ఉంటారా?తమ ఉత్పత్తుల ధర ఎంత ఉండాలో అధికారులు ఎలా నిర్ణయిస్తారు? వారికేమైనా ఆయా ఉత్పత్తుల గురించి, వాటి లభ్యత, రవాణా, తయారీకయ్యే ఖర్చుల గురించి అవగాహన ఉందా?ఆ అవగాహన లేనప్పుడు అధికారులు ఉత్పత్తుల వాస్తవ ధర, మేము పెంచేశామని చెపుతున్న ధరలను ఏవిదంగా నిర్ధారిస్తున్నారు?” అని అందరూ సభావేదికపైనే గట్టిగా నిలదీయడంతో మంత్రి బుగ్గన, అధికారులు షాక్ అయ్యారు.

ADVERTISEMENT

గ్రానైట్, ఫర్నీచర్, ఫ్లైవుడ్ తదితర పరిశ్రమల యజమానులు తమ తమ ఉత్పత్తుల గురించి అధికారులకు ఏం అవగాహన ఉందని అడిగినప్పుడు ఎవరూ సమాధానం చెప్పలేకపోయారు.

జీఎస్టీ పన్ను ఎగవేశామనో లేదా బిల్లింగ్‌లో తేడా ఉందనో, వే బిల్లులలో ఉత్పత్తుల విలువ పెంచేశామనో లేదా తగ్గించేసి చూపామనో సాకుతో చెక్ పోస్టుల దగ్గర సరుకు రవాణాను అడ్డుకోవడం, తరచూ నోటీసులు పంపుతూ ఒత్తిడికి గురించేస్తుండటం, ప్రభుత్వ ఆదాయం తక్కువగా ఉందంటూ జరిమానాల పేరుతో బలవంతంగా తమ వద్ద నుంచి డబ్బు వసూలు చేయడం సరికాదని పారిశ్రామిక వేత్తలు మంత్రిగారి మొహం మీదనే కుండ బద్దలు కొట్టినట్లు చెప్పేశారు. కొన్నిసార్లు ప్రభుత్వ పోర్టల్లో లోపాల కారణంగా తాము సకాలంలో పన్నులు చెల్లించలేకపోతే దానికీ జరిమానాలు విధిస్తూండటాన్ని పారిశ్రామికవేత్తలు తీవ్రంగా తప్పు పట్టారు.

ఇప్పటికే ఈ కామర్స్ సంస్థల ఆన్‌లైన్‌ వ్యాపారాలతో, భారీ షాపింగ్ మాల్స్ వలన తమ వ్యాపారాలు దారుణంగా పడిపోయి నష్టపోతున్నామని, ఈ సమయంలో తమకు అండగా నిలవాల్సిన ప్రభుత్వం కూడా వేధిస్తుండటం సరికాదని కుండబద్దలు కొట్టినట్లు వేదికపైనే చెప్పారు.

వారి ఆవేదనను అర్దం చేసుకొని వారి సమస్యలను పరిష్కరించాల్సిన మంత్రి బుగ్గన సమాధానం విని పారిశ్రామికవేత్తలు షాక్ అయ్యారు.

“ప్రభుత్వానికి ఆదాయం తక్కువగా ఉందని మేమ్మెన్నడూ చెప్పలేదు. ఆ కారణంతో పన్నుల వసూళ్ళకి అధికారులకి మేము ఎలాంటి లక్ష్యాలు విధించలేదు. కనుక మీ దగ్గర నుంచి అధికారులు పన్నులు పిండుకొంటున్నారనడం, అనవసరంగా పన్నులు చెల్లిస్తున్నామని మీరు భావిస్తుండటం సరికాదు. మీరు చెపుతున్న సంస్థలపై అధికారుల దాడులు, తనికీలు, జరిమానాల విధింపు, చెక్ పోస్టుల వద్ద సరుకు రవాణా వాహనాలను నిలిపివేయడం తదితర అంశాలన్నిటినీ విశ్లేషించి పర్యవేక్షించడానికి ఓ విశ్లేషణ విభాగాన్ని త్వరలో ఏర్పాటు చేస్తాము. ప్రభుత్వం, పారిశ్రామికవేత్తలు, వ్యాపారస్తుల మద్య సమన్వయం కోసం ఇదేవిదంగా ప్రతీ 3 నెలలకి ఒకసారి వాణిజ్య సలహా కమిటీ సమావేశాన్ని నిర్వహించుకొందాము,” అని మంత్రి బుగ్గన అన్నారు.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Rajinikanth’s Dharman: The Disaster Fear After Jailer 2?

Following the terrible failure of Coolie, Rajinikanth made a comeback with his most anticipated sequel…

22 minutes ago

Weak Box Office: 5 Stars Who Don’t Deserve Solo Films?

Every actor deserves to do a solo film. Unfortunately, there is a long list of…

52 minutes ago