
‘ఆంధ్రప్రదేశ్‌లో నియోజకవర్గాల పునర్విభజన జరిగే అవకాశం ఉందా?’ అంటూ వైఎస్సార్ సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానంగా కేంద్ర హోంశాఖ సహాయమంత్రి హన్స్‌రాజ్ గంగారామ్ అహిర్ పంపిన లేఖలో ఈ మేరకు పేర్కొన్నారు. 2014 ఏపీ పునర్విభజన చట్టంలోని సెక్షన్ 26కు అనుగుణంగా రాజ్యాంగంలోని 170వ అధికరణను సవరించనిదే ఏపీ, తెలంగాణలో అసెంబ్లీ సీట్ల పెంపు సాధ్యం కాదని లేఖలో పేర్కొన్నారు.
ఏపీలో అసెంబ్లీ సీట్లను 175 నుంచి 225కు, తెలంగాణలో 119 నుంచి 153కు పెంచడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. రాజ్యాంగ సవరణ జరిగితే తప్ప ఇది సాధ్యమయ్యే పని కాదని తేల్చి చెప్పారు. ఒకవేళ రాజ్యాంగాన్ని సవరించాలంటే సగానికి పైగా రాష్ట్రాలు ఈ ప్రతిపాదనను అమోదించాల్సి ఉంటుందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇది ఆచరణకు సాధ్యం కాని విషయంగా మారిందని అన్నారు.
Prabhas fans may finally start getting more updates about Fauzi from this month. Mythri Naveen…
After the arrival of the Revanth Reddy government in Telangana, the food safety authorities have…