Telugu

“కాసినో పెట్టినందుకు సన్మానమా?” – కొడాలి నాని?

మీడియా ముందుకు వచ్చిన ప్రతిసారి ఏదొక విధంగా హాట్ టాపిక్ అవ్వడంతో కొడాలి నానికి మించిన వ్యక్తి మరొకరుండరు అనిపించే విధంగా మారుతున్నారు. తాజాగా మీడియా ముందుకు వచ్చిన కొడాలి నాని ప్రెస్ మీట్ నిర్వహించే ముందు ఆఫ్ ది రికార్డ్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి.

మీకు సన్మానం చేయాలి సార్ అన్న వ్యాఖ్యలకు ప్రతిగా ‘ఎందుకు కాసినో పెట్టినందుకు సన్మానమా?’ అంటూ కొడాలి నాని అన్న మాటలు వినిపించాయి. అయితే ఈ వ్యాఖ్యలు కొడాలి నాని స్వరంతో వినిపించాయి గానీ, వీడియోలో మాత్రం కొడాలి కనిపించలేదు.

ADVERTISEMENT

పలు మీడియా మాధ్యమాలు కూడా ఈ వీడియోలను ప్రసారం చేసి, ‘కాసినో పెట్టానని కొడాలి నాని ఒప్పుకున్నట్లుగా కధనాలు అందించాయి. అలాగే ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం కూడా తమ అధికారిక సోషల్ మీడియా మాధ్యమాలలో ఈ వీడియోను పోస్ట్ చేసి కొడాలి నానిపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.

అసలు గుడివాడలో కాసినో జరగలేదు, ఎక్కడో వీడియోలు తీసుకువచ్చి ఇక్కడ పెట్టి గుడివాడలో జరిగినట్లుగా చిత్రీకరించారంటూ వీడియోలనే బుకాయించిన కొడాలి నాని, మరి ఇప్పుడు వీడియోలో లేకుండా కేవలం ఆడియోలో వినిపించిన వ్యాఖ్యలు తనవే అని ఒప్పుకుంటారా?

తన వాయిస్ ను మిమిక్రీ చేసి ఇలా వీడియో చేసారని తిరిగి టీడీపీనే టార్గెట్ చేసినా ఆశ్చర్యపడాల్సిన పనిలేదు. అయితే కొడాలి నాని చెప్పబోయేది ఎలా ఉన్నా… ఈ వ్యాఖ్యల వీడియో సాక్ష్యంతో ‘పెట్రోల్ రెడీ’ అంటూ టిడిపి, జనసేన వర్గాలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Aadi Saikumar Slams Trolls Over YouTuber Mouli Mockery

Aadi Saikumar knows what it feels like to experience both success and failure in the…

14 minutes ago

మస్క్‌ టైమింగ్‌ యాదృచ్ఛికమేనా?

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విదేశాలు జోక్యం చేసుకుని, ఫలితాలను ప్రభావితం చేస్తున్నాయని నాడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆరోపించారు. విదేశీ జోక్యాన్ని…

34 minutes ago