
Andhra Voter Protests: Why Such Silence?
దేశంలో లక్షలాది ప్రజల ఓట్లు ‘చోరీ’ అయ్యాయంటూ సీజేపీ, కాంగ్రెస్ మిత్రపక్షాల అధ్వర్యంలో సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామాకు పట్టుబడుతూ ఆందోళనలు జరుగుతున్నాయి.
అయితే ఆంధ్రప్రదేశ్‌తో సహా ఎన్డీయే ప్రభుత్వాలు అధికారంలో ఉన్న పలు రాష్ట్రాలలో పెద్దగా ఆందోళనలు జరగకపోవడం, ఒకవేళ జరిగినా అక్కడ బిజేపిని, మోడీ ప్రభుత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకించే ప్రాంతీయ పార్టీలు పూనుకున్నప్పుడే జరుగుతుండటం ఆలోచింపజేస్తుంది.
అలాగే కాంగ్రెస్ అగ్రనేతలు కొలువుండే దేశరాజధాని ఢిల్లీలో, కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాలలోనే ఈ హడావుడి కాస్త ఎక్కువగా కనిపిస్తుండటం కూడా ఆలోచింపజేస్తుంది.
అంటే ఆంధ్రతో సహా ఎన్డీయే ప్రభుత్వాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలలో ‘ఎస్ఐఆర్’ జరుగలేదా? జరిగినా ఎవరి ఓట్లు తొలగించలేదా?అంటే జరిగింది. తొలగించబడ్డాయి. కానీ ఏపీలో ఎక్కడా ఆందోళనలు జరగడం లేదు? ఎందుకంటే ఈ ఉద్యమాలు ఓ రాజకీయ లక్ష్యంతో రాజకీయ ప్రేరిత కనుకనే అని అనుకోవాల్సి ఉంటుంది.
ఆంధ్రప్రదేశ్‌తో సహా ఎన్డీయే ప్రభుత్వాలు ఇలాంటి విషయాలలో తల దూర్చక పోవడం సర్వసాధారణం. కానీ వైసీపీ, బీఆర్ఎస్ వంటి ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి కదా? అనుకుంటే అవి కూడా ఈ విషయంలో తలదూర్చి కేంద్రానికి ఆగ్రహం తెప్పించకూడదని అనుకోవడం వలన మౌనం వహిస్తున్నట్లు భావించవచ్చు.
తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాలో మొక్కుబడిగా స్పందిస్తోంది. అది తీవ్రంగా వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ పార్టీ అధ్వర్యంలో ఈ ఆందోళనలు జరుగుతుండటం, కేసులు, ఇతర లెక్కలు కారణాలు కావచ్చు.
ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ కూడా రంగంలో దిగి పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఆందోళనలు చేపట్టినా, జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేసినట్లయితే, ఆ క్రెడిట్ కాంగ్రెస్ పద్దులో జమ అవుతుంది తప్ప బీఆర్ఎస్ పద్దులో కాదు. కాంగ్రెస్‌కు రాజకీయ లబ్ది కలిగించాలని బీఆర్ఎస్ పార్టీ కోరుకోదు కదా?
కానీ సీజేపీ ఒత్తిళ్ళకు తలొగ్గి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసినప్పుడు, దాని నుంచి స్పూర్తి పొందిన వైసీపీ మంత్రి నారా లోకేష్ రాజీనామాకు పట్టుబడుతూ ఆందోళనలు నిర్వహించింది.
కానీ అదే వైసీపీ ఇప్పుడు మౌనంగా ఉండిపోయింది. ఎందుకు? అంటే జ్ఞానేష్ కుమార్‌కు వ్యతిరేకంగా ఆందోళనలు చేయడమంటే మోడీ ప్రభుత్వంపై కత్తి దూయడమే అవుతుందని భావిస్తుండటం వల్ల కావచ్చు.
ఈవిధంగా వైసీపీ, బీఆర్ఎస్ వంటి ప్రాంతీయ పార్టీలకు కేసులు, సమస్యలు, సమీకరణాల లెక్కలు ఉన్నట్లే, దేశంలో ఇతర రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలకు కూడా ఉంటాయి.
అందుకే ఒక్కో రాష్ట్రంలో ఈ ఉద్యమాలు ఒక్కో రకంగా ఉన్నాయి. ఒకవేళ ఇది నిజంగా జెన్-జీల ఉద్యమమే అయితే ఈపాటికి దేశమంతా సమానంగా అట్టుడికి పోయేది కదా? కానీ ఉడకట్లేదంటే రాజకీయ పార్టీల ఈ లెక్కలే కారణం.
కనుక ప్రజాస్వామ్యం, ఓటు హక్కు కాపాడటం పేరుతో జరుగుతున్న ఈ ఆందోళనలు, రాజకీయ పార్టీల భిన్న స్పందనల వెనుక దేని ప్రయోజనాలు దానికి. దేని లెక్కలు దానికి ఉన్నాయని అని చెప్పక తప్పదు. ఈ విషయం దేశ ప్రజలు గమనించడం అవసరం.
YouTuber Dhruv Rathee has alleged that he was taken from his home on October 10…
Recently, the much-anticipated interview of Jailer with its cast and crew took place, during which…