
ఎన్నికలకు సమయం ముంచుకొస్తున్న వేళ నిరసన కారులకు అవకాశాలు వెతుకుంటూ వస్తాయి అనే మాటలను నిజం చేస్తూ ఏపీలో ప్రభుత్వం పై నిరసన బాట పట్టారు అంగన్వాడీ ఉద్యోగులు, నిరుద్యోగ యువత.
తమ పనికి తగిన ప్రతిఫలం, గుర్తింపు ఇవ్వాలంటూ ప్రభుత్వం పై పోరాటానికి సిద్ధమయ్యారు అంగన్వాడీ ఉద్యోగులు. రెండు రోజులుగా ప్రభుత్వంతో జరుగుతున్న చర్చలు ఫలించక పోవడంతో ఇక సమ్మె బాట పట్టారు అంగన్వాడీ ఉద్యోగులు. కనీస వేతనం 26 వేలు చేస్తూ, గ్రాట్యుటీ చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. గత ఎన్నికల హామీగా ఇచ్చిన వాగ్దానాలు ఇప్పటికి పూర్తి చేయలేదని, తెలంగాణ రాష్ట్రంలో కంటే అదనంగా జీతాలు చెల్లిస్తామని చెప్పి ఇప్పుడు జగన్ మాట తప్పారంటు తమ గళం విప్పారు.
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తమపై పని భారం కూడా పెరిగిందని, పని సమయాన్ని పెంచిన ప్రభుత్వం అందుకు అనుగుణంగా వేతనాలు పెంచకపోవడం అన్యాయం అంటూ వైసీపీ ప్రభుత్వం పై నిరసన తెలపడానికి రోడ్డు మీదకు వచ్చారు. అలాగే నారా లోకేష్ కూడా అంగన్వాడీ ఉద్యోగుల సమ్మెకు మద్దతు తెలిపి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
పనిలో పనిగా నిరుద్యోగ యువత కూడా వైసీపీ ప్రభుత్వం మెడలు వంచడానికి ఇదే సరైన సమయంగా భావించి మెగా డీఎస్సీ డిమాండ్ ను తెర మీదకు తెచ్చారు. “మినీ డీఎస్సీ వద్దు మెగా డీఎస్సీ కావలి” అంటూ నినాదాలు చేస్తూ అవనిగడ్డ ఎమ్మార్వో కార్యలయం వద్ద ఆందోళన చేపట్టారు నిరుద్యోగ యువత. కాళీగా ఉన్న 23 వేల మెగా డీఎస్సీ పోస్టులకు నోటిఫికేషన్ వెంటనే విడుదల చెయ్యాలంటూ వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఫ్లకార్డ్స్ పట్టుకుని నిరసన తెలిపారు.
ప్రభుత్వంతో పని చేయించుకోవడానికి, తమ డిమాండ్లు పరిష్కరించుకోవడానికి ఇదే సరైన సమయం అన్నట్టుగా ఇటు అంగన్వాడీ వర్కర్లు, అటు మెగా డీఎస్సీ కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులు ప్రభుత్వం పై ఒత్తిడి తేవడానికి సిద్ధమయ్యారు.వీరిరువురు తమ నిరసనలతో వైసీపీ ప్రభుత్వ మెడలు వంచగలరో లేదో వేచి చూడాలి.
The latest poster of Vrushakarma features Naga Chaitanya holding a distinctive weapon against a mysterious…
The popular reality show The Traitors is making its Telugu debut with Prime Video’s The…