
Can Anil Win Sankranti 2027 Again?
అనిప్ రావిపూడికి ఎప్పుడూ ఒక ప్లస్ పాయింట్ ఉంటుంది. అదేంటనే మిగతా దర్శకులందరూ పాన్ ఇండియన్ సినిమాలని, భారీ బడ్జెట్ యాక్షన్ సినిమాలని నానా హడావుడి పడుతుంటే.. అనిల్ రావిపూడి మాత్రం సింపుల్ గా రీజనల్ కామెడీ సినిమాతో వచ్చి సైలెంట్ గా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేస్తాడు.
2025 సంక్రాంతికి వచ్చిన “గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం” సినిమాల్లో అనిల్ సినిమానే సూపర్ హిట్ గా నిలిచింది.
2026 సంక్రాంతి పరిస్థితి కూడా ఇంచుమించుగా అంతే.. “మన శంకర వరప్రసాద్ గారు, రాజాసాబ్, భర్త మహాశయులకు విజ్ఞప్తి, అనగనగా ఒక రాజు, నారీ నారీ నడుమ మురారి” వంటి సినిమాలు రిలీజ్ అవ్వగా.. అనిల్ రావిపూడి మన శంకర వరప్రసాద్ గారు మాత్రమే హిట్టయ్యింది, మిగతా సినిమాలు యావరేజ్ గా నిలిచాయి.
అయితే.. 2027 సంక్రాంతి సీజన్ మాత్రం వైవిధ్యంగా అన్ని రీజనల్ సినిమాలే లిస్ట్ లో ఉన్నాయి. చిరంజీవి “కాకా”, వెంకటేష్ జనవరి 12 విడుదల, శర్వానంద్ జార్జ్ క్రిష్, రవితేజ-శ్రీవిష్ణుల “వీరాధి వీరులంట”, నాగార్జున లాటరీ కింగ్.. ఇలా అన్నీ రీజనల్ సినిమాలే. సంక్రాంతికి వారం ముందు ప్రశాంత్ వర్మ “మహంకాళి” కూడా రిలీజ్ కి రెడీ అవుతుంది.
ఇవన్నీ చూస్తే.. అనిప్ రావిపూడికి సంక్రాంతి సక్సెస్ ఈసారి అంత ఈజీ కాదు అనిపిస్తోంది. దాదాపుగా అన్నీ ఎంటర్టైనర్లే. మరి ఈ పోటీ నడుమ అనిల్ ఈసారి తనదైన ప్రమోషన్స్ అండ్ కంటెంట్ తో నిలబడగలుగుతాడా? అనేది ఆసక్తికరమైన అంశం.
One of the iconic film franchises in Indian cinema turned out to be Dhurandhar. First…
Recently, Vijay Sethupathi's film Baththa directed by Balaji Tharaneetharan and released in theatres, has received…