Telugu

రాజమహేంద్రవరం మేయర్‌ పదవి ఎవరికి?

రాజమహేంద్రవరం మేయర్‌ ఎన్నికల్లో మూడు ప్రశ్నలు వినిపిస్తున్నాయి. కూటమిలో టీడీపి, జనసేన ఓట్లు బిజేపికి బదిలీ అవుతాయా లేదా?ప్రజలు సంక్షేమ పధకాలు గుర్తు చేసుకొని అధికారంలో లేని వైసీపీని గెలిపిస్తారా లేదా? రెబెల్ అభ్యర్ధులతో ఏ పార్టీ ఓట్లు చీలి ఎవరు లబ్ది పొందుతారు?

ముందుగా నాలుగు ముక్కల్లో రాజమహేంద్రవరం కార్పోరేషన్, ఎన్నికల షెడ్యూల్, అభ్యర్థుల గురించి వివరాలు.

ADVERTISEMENT

రిజర్వేషన్: ఎస్సీ జనరల్ కేటగిరీ

మొత్తం డివిజన్లు: 72, పోలింగ్: నవంబర్‌ 26న, కౌటింగ్, ఫలితాల వెల్లడి: నవంబర్‌ 30న

జనాభా: 4.63 లక్షలు.

కూటమి మేయర్‌ అభ్యర్ధి: రేలంగి శ్రీదేవి (బిజేపి), వైసీపీ: దాసి వెంకట్రావు, కాంగ్రెస్‌: బుడితి అన్విత (మాజీ ఎంపీ హర్షకుమార్ కోడలు).

వీరుకాక మరో 10 మంది మేయర్‌ పదవికి పోటీ పడుతున్నారు. వీరిలో వైసీపీ రెబెల్ అజ్జరపు వాసు, కూటమి రెబెల్స్ కూడా ఉన్నారు.

రాజమహేంద్రవరంలో టీడీపి, వైసీపీలు బలంగా ఉన్నాయి. జనసేన కూడా బాగానే పుంజుకుంది. కానీ సీట్ల సర్డుబాట్లలో బిజేపికి ఈ సీటు దక్కింది.

కనుక బీజేపీ ఎంపీ పురందేశ్వరి, టీడీపి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, జనసేన నేతలతో కలిసి కూటమి అభ్యర్ధి రేలంగి శ్రీదేవి తరపున జోరుగా ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. కనుక ఆ రెండు పార్టీల ఓట్లు ఆమెకు బదిలీ అయ్యే అవకాశం ఎక్కువగానే ఉంటుంది.

వచ్చే ఏడాది గోదావరి పుష్కరాలు జరుగుతున్నాయి. కనుక రాజమహేంద్రవరానికి భారీగా నిధులు విడుదల చేయబోతోంది. కనుక కార్పోరేషన్, మేయర్‌ పదవి కూటమి చేతిలో ఉంటే మరిన్ని నిధులు తెచ్చుకొని, మరింత సమన్వయంతో నగరాన్ని అభివృద్ధి చేస్తామని కూటమి నేతలు ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. కనుక కూటమికి పుష్కరాలు కూడా కలిసి వచ్చే అంశమే.

అయితే మాజీ ఎంపీ హర్షకుమార్‌కు నగరంలో బడుగు బలహీనవర్గాలు, క్రీస్టియన్, మైనారిటీ వర్గాలపై మంచి పట్టుంది. కనుక ఆయన కోడలు బుడితి అన్విత బరిలో దిగడంతో వారి ఓట్లు చీలే అవకాశం ఉంటుంది.

వైసీపీ ప్రధానంగా వారి ఓట్లపైనే ఆధారపడింది. వైసీపీ రెబల్ అభ్యర్థి అజ్జరపు వాసు కూడా బరిలో ఉన్నారు. కనుక ఈ ఇరువురి వలన ఓట్లు చీలికతో వైసీపీ కొంత నష్టపోవచ్చు.

వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అమలు చేసిన సంక్షేమ పధకాలు, కూటమికి వ్యతిరేకంగా చేస్తున్న ప్రచారం తప్ప వైసీపీకి కొత్తగా చెప్పుకునేందుకు ఏమీ లేదు.

కనుక ఈ ఎన్నికల్లో వైసీపీని ఎందుకు గెలిపించాలో చెప్పుకునే పరిస్థితిలో అది ఉంటే, గెలిపిస్తే ఏమేమి చేయగలమో కూటమి పార్టీలు చెప్పుకుంటున్నాయి.

పైగా ఇంతవరకు జరిగిన మున్సిపల్, పరిషత్ ఎన్నికల్లో కూటమి ప్రభంజనం సృష్టించింది. కనుక రాజమహేంద్రవరం మేయర్‌ ఎన్నికల్లో కూడా అదే కొనసాగేవచ్చు.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

కోలీవుడ్‌లో విజయ్ తర్వాత ధనుష్… మరి టాలీవుడ్‌లో ఆఫ్టర్ పవన్?

దక్షిణాదిన సినీ పరిశ్రమకు, రాజకీయ రంగానికి విడదీయలేని అనుబంధం ఉంది. నాటి ఎంజీఆర్, ఎన్టీఆర్, జయలలిత వంటి దిగ్గజాల నుంచి…

24 minutes ago

Star Father Got Wasted, But Son Got Acclaim!

Last weekend was an interesting one for Malayalam audience as they witnessed two of their…

35 minutes ago