
చెన్నైలో ఇంటి నుంచి బయటకు వెళ్తున్న సమయంలో కారణం లేకుండా ట్రాఫిక్ కానిస్టేబుల్ తన కారును ఆపారని, సిగ్నల్ క్రాస్ చేశావంటూ 300 రూపాయలు డిమాండ్ చేశారని పేర్కొంది. దీంతో తాను ‘మీ పేరు చెప్పండి’ అని అడగడంతో ‘సర్లే 100 ఇవ్వు’ అని డిమాండ్ చేశారని తెలిపింది.
దీంతో మళ్లీ తాను ‘నీ పేరేంటో చెప్పు’ అని అడగడంతో ‘మీరెవరు మేడమ్’ అని అడిగాడని చెప్పింది. ‘కారణం లేకుండా వేధింపులకు గురవుతున్న చెన్నై పౌరురాలినని’ తాను చెప్పడంతో క్షమించమని చెప్పి వెళ్లమన్నాడని సాయి గాయిత్రి తెలిపింది. మణిరత్నం ‘అంజలి’ సినిమాలో సాయి గాయత్రి నటించిన విషయం తెలిసిందే.
BOTTOM LINE Period Gangster Saga Is All Show, No Substance PLATFORM Netflix RUNTIME 3 Hours(5…
The release date of Ramayana is approaching, and amid that, the movie continues to be…