
అక్కడే ఇంతకాలం చలివేంద్రంలో వచ్చిపోయే ప్రయాణికులకు, ప్రజలకు చల్లటి మంచినీళ్ళు, మజ్జిగ పంపిణీ చేసేవారు. అయితే టిడిపి కార్యకర్తలు ఏర్పాటు చేసిన తాత్కాలిక అన్నా క్యాంటీన్ బ్యానర్‌పై ఓ పక్క తమ అధినేత చంద్రబాబు నాయుడు, మరోపక్క టిడిపి జాతీయ కార్యదర్శి నారా లోకేష్ ఫోటోలు ఉండటంతో స్థానిక వైసీపీ నేతలు మునిసిపల్ సిబ్బందికి ఫిర్యాదు చేశారు.
మున్సిపల్ అధికారులు వెంటనే పోలీసులను, జేసీబీని వెంటబెట్టుకువచ్చి అన్నా క్యాంటీన్ శిబిరాన్ని కూల్చివేశారు. టిడిపి నాయకులు, కార్యకర్తలు వారిని అడ్డుకొనేందుకు ప్రయత్నించడంతో పోలీసులు వారందరినీ అదుపులోకి తీసుకొని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. బస్టాండ్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొని ఉండటంతో భారీగా పోలీసులను మోహరించారు.
టిడిపి నేతలు ఏర్పాటు చేస్తున్నది శాస్విత కట్టడం ఏమీ కాదు. ఎండలు మండిపోతున్నాయి కనుక ఆహార పదార్ధాలను పెట్టుకొనేందుకు, ఎవరైనా వస్తే అక్కడ కూర్చొని భోజనం చేసేందుకు తాత్కాలికంగా టెంట్ మాత్రమే వేశారు. కానీ దానిని కూల్చివేయడానికి మున్సిపల్ అధికారులు ఏకంగా జేసీబీతో రావడం విస్మయం కలిగిస్తుంది.
టిడిపిపై ద్వేషంతో రగిలిపోతున్న వైసీపీ అధికారంలోకి రాగానే రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటైన అన్నా క్యాంటీన్లను అన్నిటినీ మూసివేయించింది. వైసీపీ ప్రభుత్వం అన్నా క్యాంటీన్లను మూయించేసి తమ కడుపు కొట్టిందని పేదలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పుడు బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా కేవలం ఒక్క రోజు కోసం మంగళగిరిలో టిడిపి నేతలు అన్నదాన కార్యక్రమం చేపట్టబోతే దానినీ అడ్డుకొని కూల్చివేసారు. ఎందుకంటే దానికి అన్నా క్యాంటీన్ అని పేరు పెట్టినందుకు… దానిపై చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ ఫోటోలు ముద్రించినందుకు!
ఒకవేళ అక్కడ ఆన్నదాన కార్యక్రమం నిర్వహించేందుకు అనుమతి ఇవ్వదలచుకోకపోతే వేరే ప్రాంతంలో నిర్వహించుకోమని చెప్పవచ్చు. మునిసిపల్ సిబ్బందితో ఆ టెంటును తొలగించవచ్చు. కానీ జేసీబీతో కూల్చివేయడం చూస్తే వైసీపీ నేతలు ఎంత కడుపు మంటతో రగిలిపోతున్నారో అర్ధం చేసుకోవచ్చు.
In an industry where success often decides everything, some filmmakers continue getting opportunities because of…
As CM Vijay takes his oath today, he carries a heavy burden of suspicion. For…