
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సైతం ఆయన అందాన్ని చూసి కుళ్ళుకుంటున్నాడు, అందుకే ఆయన మీద కేసులు వేసి జైలుకు పంపించారు అంటూ వైసీపీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలతో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ‘అందగాడు’ అనే పేరు స్థిరపడిపోయింది.
అయితే ఇప్పుడీ అందగాడికి బెయిలు కష్టాలు సీరియల్ మాదిరి కొనసాగిస్తూనే వస్తున్నాయి. గన్నవరం టీడీపీ కార్యాలయం మీద దాడి కేసులో, ఆ కేసులో సాక్షి గా ఉన్న సత్యవర్ధన్ అనే వ్యక్తిని కిడ్నాప్ చేసి బెదిరించిన కేసులో ఫిబ్రవరి 13 న అరెస్టయ్యి జైలుకెళ్లిన ఈ వైసీపీ అందగాడు ఇప్పటికి పలుమార్లు బెయిల్ కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
అయితే వంశీ మీద ఉన్న కేసులు ఆధారంగా వంశీకి మాత్రం ఇప్పటికి కోర్టులు బెయిలు మంజూరు చెయ్యలేదు. అయితే వంశీ గత ఐదేళ్ల పాపాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్న నేపథ్యంలో వంశీ పై మరో కేసు నమోదయ్యింది. భూ అక్రమ రిజిస్టేషన్ కేసులో తనకు ముందస్తు బైలు మంజూరు చెయ్యాలంటూ వంశీ ఇటీవల కోర్టులో పిటిషన్ వేయడం జరిగింది.
అయితే ఈ పిటిషన్ కు కౌంటర్ దాఖలు చేయాలంటూ న్యాయస్థానం పోలీసులను ఆదేశించి, తన తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. దీనితో వంశీ ఇప్పటికి తన పై ఉన్న కేసులతో పాటుగా ఇప్పుడు మరో కొత్త కేసు మీదపడడంతో ఈయన గారికి ఇప్పుడప్పుడే బెయిలు వచ్చే అవకాశాలు కనిపించకుండా పోతున్నాయి.
అధికారం ఉంది కదా, అధినేత చెప్పాడు కదా, ఇక రాబోయే 30 ఏళ్ళు మనదే ప్రభుత్వం అనే ధీమాతో నాడు నోటికి పని చెప్పి ఇష్టానురీతిగా రెచ్చిపోయిన వంశీ ఇప్పుడు జైలు నుండి బెయిలు మీద బయటకు రావడానికి కూడా నానా తంటాలు పడుతున్నారు.
ఒక ఆడదాని అవమానానికి కురుక్షేత్రమే జరిగింది, మరో ఆడదాని శాపానికి ఒక మహానగరమే సముద్రంలో కలిసిపోయింది, అలాగే ఒక స్త్రీ ఆగ్రహానికి లంకాదహనమే జరిగింది, అలాంటిది గత ఐదేళ్ల వైసీపీ హయాంలో ఎంతోమంది మహిళలను అగౌరవపరచి, వారి ఆత్మ గౌరవాన్ని దెబ్బ కొట్టిన ఆ పార్టీ నాయకులు ఇప్పుడు రాజకీయ సమాధి కాకతప్పలేదు.
అందుకు గాను వైసీపీలో కొందరు జైళ్లలో మగ్గుతుంటే, మరికొందరు ఆసుపత్రులలో అవస్థలు పడుతున్నారు, ఇంకొందరు అజ్ఞాతంలో జీవిస్తున్నారు. ఇప్పటికైనా వైసీపీ అహంకారంతో కాకుండా సహనంతో రాజకీయం చేయడం ఆ పార్టీ భవిష్యత్ కు అత్యంత కీలకం కానుంది.
Tollywood’s December release race is getting more interesting, with Nithiin’s Alias Rukmini joining the December…
Vijay’s son Jason Sanjay chose to make his entry into films as a director rather…