Telugu

హీరోయిన్ గారు… ఇండస్ట్రీలో ఇలాంటివి కామనే..!

ఒక హీరో చేయాల్సిన సినిమా చివరికి మరో హీరో సొంతం కావడం… అలాగే ఒక హీరోయిన్ దరికి చేరిన సినిమాను మరో హీరోయిన్ చేయడం… అనేవి సినీ పరిశ్రమలో చాలా సర్వసాధారణం. అయితే ఇలా వదిలేసుకున్న ఛాన్స్ లు బ్లాక్ బస్టర్లో, ఇండస్ట్రీ హిట్లో అయినపుడు ఆయా హీరోలకు, హీరోయిన్లకు మిగిలే మనోవేదన వర్ణానాతీతం.

[m9ad]

ADVERTISEMENT

ప్రస్తుతం అలాంటి అనుభవాన్నే హీరోయిన్ అను ఇమ్మానుయెల్ చవిచూస్తోంది. వచ్చేవారంలో “శైలజారెడ్డి అల్లుడు” సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న అను, ప్రస్తుతం ప్రమోషన్ ఇంటర్వ్యూలు ఇస్తోంది. ఇందులో భాగంగా తను వదులుకున్న రెండు బ్లాక్ బస్టర్ సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పుకొచ్చింది ఈ బ్యూటీ.

త్రివిక్రమ్ – పవన్ కళ్యాణ్ కాంబోలో వచ్చిన “అత్తారింటికి దారేది” సినిమాలో ‘బాపు బొమ్మ’ ప్రణీత పోషించిన క్యారెక్టర్ తొలుత తన వద్దకే వచ్చిందని, అలాగే ప్రస్తుతం బాక్సాఫీస్ ను ఏలుతోన్న ‘గీత గోవిందం” సినిమాకు ‘నా పేరు సూర్య’ వలన డేట్లు సర్దుబాటు చేయలేక వదులుకోవాల్సి వచ్చిందని, ఈ కధను ‘అర్జున్ రెడ్డి’ సినిమాకు ముందే తాను విన్నానని చెప్పుకొచ్చింది.

బహుశా విజయ్ దేవరకొండ సరసన చేయడం ఇష్టం లేకో, దర్శకుడిపై గురి లేకో ‘గీత గోవిందం’ను వదిలిపెట్టిన అను, ఈ సినిమాను మిస్ చేసుకున్నందుకు చాలా బాధపడిందట. అయితే వదులుకున్న సినిమాలన్నీ సూపర్ హిట్లు కావు, ఇలాగే వదిలేసిన చాలా సినిమాలు డిజాస్టర్లు కూడా అయ్యుంటాయి, మరి ఆ సినిమా పేర్లను మాత్రం అను ప్రస్తావించలేదు.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Tamil Biggest Overseas Grossers: Rajinikanth Beats Vijay

Rajinikanth's most anticipated sequel Jailer 2 directed by Nelson Dilipkumar, was released in theatres on…

19 minutes ago

Cyclone Arnab Hits Andhra Coast, CBN Orders High Alert

Cyclone Arnab has made landfall near Narasapuram in Andhra Pradesh after approaching the coast south…

1 hour ago