Telugu

అవినీతి కేసులో కోర్టులో లొంగిపోయిన బుల్లితెర నటుడు!

‘కుసుమ్, కుంకుమ్’ టీవీ సీరియళ్ళతో ఆదరణ పొందిన ప్రముఖ హిందీ బుల్లి తెర నటుడు అనూజ్ సక్సేనా ఢిల్లీ కోర్టులో లొంగిపోయారు. ఎల్డర్ ఫార్మాస్యూటికల్స్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌ గా ఉన్న అనూజ్‌‌ కు ఢిల్లీ కార్పొరేట్ అఫైర్స్ మాజీ డైరెక్టర్ జనరల్ బీకే బన్సల్‌ అవినీతి కేసులో ప్రత్యక్ష ప్రమేయం ఉన్నట్లు సీబీఐ ఆరోపించింది. సుమారు 24 వేల మంది మదుపరుల నుంచి 175 కోట్ల రూపాయలను చట్ట విరుద్ధంగా డిపాజిట్ల రూపంలో సేకరించడంలో కీలక పాత్ర పోషించారని నిరూపణ అయ్యింది.

అంతే కాకుండా తన కంపెనీపై వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు చేయకుండా ఉండేందుకు, బన్సల్ కు లంచం ఇవ్వడంలో కూడా అనుజ్ దే కీలక పాత్ర అని సీబీఐ స్పష్టం చేసింది. ఈ పెట్టుబడులను విదేశాల్లో కంపెనీలకు మళ్లించి, సకాలంలో రిటర్న్ లు దాఖలు చేయలేదని సీబీఐ తెలిపింది. ఈ నేపథ్యంలో ఈ నెల 17లోపు కోర్టులో సరెండర్‌ కావాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో, ప్రత్యేక జడ్జీ గుర్దీప్‌ సింగ్‌ ముందు అనూజ్ లొంగిపోయారు.

ADVERTISEMENT
Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Itlu Arjuna Trailer: Aniesh’s Subtle Performance Stands Out

Produced by Venky Kudumula under the banner of What Next Entertainments and directed by Mahesh…

21 minutes ago

రాధాకృష్ణ విజయం ఓ లెక్క.. వైసీపీ ఓట్లు మరో లెక్క!

మాజీ ఐపీఎస్ అధికారి ఏబీవీ రావు కాంగ్రెస్‌, వామపక్షాల మద్దతుతో హఠాత్తుగా విజయవాడ మేయర్‌ పదవికి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో…

32 minutes ago