
ఏపీ శాసనసభ బడ్జెట్ సమావేశాలు కొద్ది సేపటి క్రితం గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగంతో మొదలయ్యాయి. జగన్ ‘టీమ్ 11’ శాసనసభ సమావేశాలకు హాజరయ్యింది. కానీ గవర్నర్ ప్రసంగిస్తుండగా వైసీపీ సభ్యులు కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాసేపు నినాదాలు చేశారు.
కల్తీ నెయ్యి వివాదంపై అధికార పార్టీ చేస్తున్న వాదనలు, విమర్శలు, ఆరోపణలను వైసీపీ బలంగా తిప్పికొడుతోంది. తాము ఎటువంటి తప్పు చేయలేదని, కూటమి ప్రభుత్వమే తప్పు చేస్తోందని గట్టిగా వాదిస్తోంది.
కనుక తప్పు చేయనప్పుడు ధైర్యంగా శాసనసభలో ప్రభుత్వాన్ని నిలదీయవచ్చు. అధికార పార్టీ విమర్శలు, ఆరోపణలకు సమాధానాలు చెప్పి దాని వాదనలు తప్పని నిరూపించవచ్చు. ప్రభుత్వమే తప్పు చేసిందని వైసీపీ గట్టిగా నమ్ముతోంది, వాదిస్తోంది. కనుక అదే వాదనలతో శాసనసభలో నిరూపించవచ్చు, కానీ గవర్నర్ ప్రసంగిస్తుండగా కాసేపు నినాదాలు చేసి వాకవుట్ చేసి వెళ్ళిపోయారు.
తద్వారా జగన్ టీమ్ తమ శాసన సభ్యత్వం కాపాడుకోవడం కోసమే వచ్చి హాజరు వేసుకొని వెళ్ళిపోయారని స్పష్టమవుతోంది.
కల్తీ నెయ్యి వ్యవహారంలో తన వాదనలో బలం లేదని జగన్ టీమ్ 11కి బాగా తెలుసు. అందుకే ఈ అంశంపై శాసనసభలో ప్రభుత్వాన్ని ఎదుర్కొనే ధైర్యం లేకనే వాకవుట్ చేసి వెళ్ళిపోయారని కూటమి ప్రభుత్వం ఆరోపించకుండా ఉండదు.
ఈ అంశంపై కూటమి సభ్యులు శాసనసభలో చర్చిస్తూ, ప్రశ్నలు సందిస్తుంటే, వారికి సమాధానాలు చెప్పేందుకు అక్కడ జగన్ టీమ్ 11 లేకపోవడాన్ని ప్రజలు కూడా గమనిస్తారు. కనుక కల్తీ నెయ్యి వ్యవహారంలో తప్పు చేశారు కనుకనే భయపడి శాసనసభ నుంచి పారిపోయారని ప్రజలు భావించకుండా ఉంటారా?
అయితే జగన్ శాసనసభ సమావేశాలకు రాకపోవడానికి అసలు కారణం వేరే ఉంది. నాడు అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడుని అతిదారుణంగా అవమానించామనే విషయం జగన్‌కి బాగా గుర్తుంది. కనుక కేవలం 10 మందితో శాసనసభ సమావేశాలలో పాల్గొంటే, ప్రతీకారంతో రగిలిపోతున్న కూటమి సభ్యులు తనని అంతకంటే ఇంకా దారుణంగా అవమానిస్తారనే భయంతోనే జగన్ శాసనసభ సమావేశాలకు హాజరుకావడం లేదు.
జగన్, కేసీఆర్ ఇద్దరూ ఈ ఇగో, భయం వల్లనే శాసనసభకు రావడం లేదని చెప్పక తప్పదు. కానీ ఇద్దరూ నెలనెలా టంచనుగా జీతం తీసుకుంటారు. జెడ్ ప్లస్ భద్రత అనుభవిస్తుంటారు. అందుకు ప్రతిగా ఇద్దరూ ప్రభుత్వాన్ని తిట్టిపోస్తుంటారు.
కానీ ఈ ఒక్క విషయంలో జగన్ కంటే కేసీఆర్ చాలా నయం. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను శాసనసభ సమావేశాలలో పాల్గొనమని చెప్పి ఆయనొక్కరే శాసనసభ నుంచి పారిపోతుంటారు. కానీ జగన్ తన ఎమ్మెల్యేలని వెంటబెట్టుకొని మరీ పారిపోతుంటారు. ఈ ఒక్కటి తప్ప మిగిలినవన్నీ సేమ్ టూ సేమ్!
Team India started the T20I series against West Indies with a complete performance in Lucknow.…
The Chiranjeevi-Srikanth Odela combination created a massive buzz when it was announced in December 2025.…