
Chandrababu Naidu at AP CII Partnership Summit
విశాఖ ఆంధ్రా యూనివర్సిటీలో ఈ నెల 12,13 తేదీల్లో సీఐఐ భాగస్వామ్య సదస్సు జరుగబోతోంది. సిఎం చంద్రబాబు నాయుడు, పలువురు రాష్ట్ర మంత్రులు, కేంద్ర మంత్రులు అమిత్ షా పీయూష్ గోయల్ తదితరులు దీనిలో పాల్గొనేందుకు వస్తున్నారు. అలాగే 59 దేశాలకు చెందిన ప్రతినిధులు, 15 మంది విదేశీ మంత్రులు, పారిశ్రామిక, వాణిజ్య రంగాలకు చెందిన 1,250 మంది ప్రముఖులు ఈ సదస్సుకు హాజరు కాబోతున్నారు. 13 తేదీన ముగింపు సదస్సుకు ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ హాజరుకాబోతున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇప్పటికే ఈ రెండున్నర ఏళ్ళలో సుమారు రూ.20 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులతో అనేక పరిశ్రమలు, ఐటి కంపెనీలను సాధించింది. ముఖ్యంగా రాష్ట్రంలో వివిధ జిల్లాలలో అందుబాటులో ఉన్న సహజ వనరులు, మానవ వనరులను బట్టి వివిధ రకాల పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేస్తోంది. కరువు పీడిత రాయలసీమ జిల్లాలకు నీళ్ళు పారిస్తూ సుమారు లక్ష కోట్ల వ్యయంతో గ్లోబల్ హార్టీ కల్చర్ హబ్ ఏర్పాటు చేస్తోంది.
ఏపీలో శరవేగంగా జరుగుతున్న పారిశ్రామీకరణ, అభివృద్ధి పనులను పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు కూడా నిశితంగా గమనిస్తూనే ఉంటారు. ముఖ్యంగా రాష్ట్రంలో రాజకీయ సుస్థిరత విషయంలో ఎవరికైనా అనుమానాలు, అపోహలు ఉన్నట్లయితే మున్సిపల్, పరిషత్ ఎన్నికల ఫలితాలతో అవి పటాపంచలు అయిపోతాయి. వైసీపీ ఎంత హడావుడి చేసినా రాష్ట్ర ప్రజలు కూటమి ప్రభుత్వంతోనే ఉన్నారని బలమైన సంకేతం ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వంలో అత్యంత కీలకమైన ఇద్దరు కేంద్ర మంత్రులు అమిత్ షా, పీయూష్ గోయల్ రేపటి సదస్సుకు హాజరవుతుండటం ద్వారా కేంద్ర ప్రభుత్వం కూడా ఆంధ్రా ప్రభుత్వానికి అండగా నిలబడుతోంది. రాష్ట్రాభివ్రుద్ధికి అవసరమైన పూర్తి సహాయసహకారాలు అందిస్తోందనే మంచి బలమైన సంకేతం ఇస్తున్నట్లవుతుంది.
కనుక బుధ,గురువారం జరిగే ఈ సీఐఐ భాగస్వామ్య సదస్సులో మరిన్ని పెట్టుబడులు, వాటితో కొత్త పరిశ్రమలు, ఐటి కంపెనీలు ఆంధ్రాకు వచ్చే అవకాశం ఉండవచ్చు
మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి రేపు అంటే నవంబర్ 11వ తేదీ ఉదయం 11.11 గంటలకు కొత్త పార్టీ ప్రకటించబోతున్నారు.…
Actress Renu Desai has spoken about the need to show kindness towards people going through…