
రెండు ఏసీ బోగీలు, రెండు రిజర్వేషన్, రెండు జనరల్, గార్డు బోగీలు పట్టాలు తప్పాయి. ఎస్ 8, ఎస్ 9 స్లీపర్ బోగీలు బాగా దెబ్బతిన్నాయి. విషయం తెలుసుకున్న సహాయక బృందాలు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను ముమ్మరం చేశాయి. వాల్తేరు డివిజనల్ రైల్వే మేనేజర్ చంద్రలేఖ ముఖర్జీ మెడికల్ రిలీఫ్ ట్రైన్ తో చేరుకున్నారు. గాయపడ్డ వారిని పార్వతీపురం, రాయ్ గఢ్, విశాఖ ఆసుపత్రులకు తరలించారు. మృతులు, గాయపడిన వారి బంధువులకు సమాచారాన్ని అందించేందుకు హెల్ప్ లైన్ నంబర్లు 8106053006, 8500358712లను ఏర్పాటు చేసినట్టు అధికారులు తెలిపారు.
ఉత్తరాంధ్ర మంత్రులంతా తక్షణం రైలు ప్రమాదం జరిగిన కూనేరుకు వెళ్లి సహాయక చర్యలను పర్యవేక్షించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేసారు. అధికారులతో సమీక్ష నిర్వహించిన అనంతరం, ఈ ఘటనపై దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన చంద్రబాబు, సహాయ చర్యలను ముమ్మరం చేయాలని విజయనగరం, విశాఖ జిల్లా పోలీసు అధికారులను ఆదేశించారు. గాయపడ్డవారికి మెరుగైన వైద్యం అందించేలా చూడాలని కలెక్టర్లకు సూచించిన చంద్రబాబు, బాధితులకు అండగా నిలవాలని, మృతదేహాలు స్వస్థలాలకు తరలింపు బాధ్యత కలెక్టర్లదేనని స్పష్టం చేశారు.
Raaka is already shaping up to be one of the most ambitious films of Allu…
Dhanush is currently one of the busiest actors in Kollywood with multiple projects in his…