ఇది” U ” టర్న్ కాదు….అంతకు మించి.!

చెప్పడానికే నీతులు ఆచరించడానికి సాధ్యం కాదనేది నమ్మలేని కటిక నిజం. ఈ నిజాన్ని మభ్య పెడుతూ జగన్ మోహన్ రెడ్డి, అతని అనుచర గళం ప్రతిపక్షాల మీద హద్దులు దాటిన విమర్శలతో రెచ్చిపోతుంటారు.

గత ఎన్నికలలో టీడీపీ పార్టీని విమర్శించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పుడు అదే టీడీపీకి మద్దతుగా ఎలా నిలబడ్డారు? అదే చంద్రబాబుని ఎలా సమర్థిస్తున్నారు? అంటూ నిత్య ప్రవచనాలు వల్లించే వైకాపా నాయకులకు కనువిప్పుకలిగేలా, నోటికి తాళం వేసేలా జగన్ రాజకీయ జీవితాన్ని, ఆయన చేసిన రాజకీయ ప్రకటనలకు 5 నిముషాల వీడియో లో బందించి సోషల్ మీడియాలో వదిలారు.

ADVERTISEMENT

ఈ వీడియో లో జగన్ ఇచ్చిన రాజకీయ స్టేట్మెంట్స్, ఆ తరువాత మాట మార్చి మడం తిప్పిన విధానం చూసిన వారంతా “ఇది” U ” టర్న్ కాదు స్వామి అంతకు మించి”…అంటూ నోరెళ్లబెడుతున్నారు. జగన్ మొదటిసారి ఎంపీ గా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి నిన్న మొన్నటి బీజేపీకి మద్దతు తెలిపిన ఉదంతాన్ని మొత్తం ఒక్క వీడియోలో పొందుపరిచి వైకాపా నాయకులతో పాటుగా జగన్ మద్దతుదారులకు కూడా ఆశ్చర్యాన్ని కలిగించారు.

తనకు ఎంపీగా పోటీ చేయడానికి అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి కృతజ్ఞతలో మొదలైన జగన్ రాజకీయ రంగ ప్రవేశం….తన తండ్రి వైస్సార్ మరణం తరువాత చేసిన ప్రకటనలతో కొనసాగింది. వైస్సార్ చివరి కోరిక రాహుల్ గాంధీ ని దేశానికీ ప్రధానిగా చేయడం దాని నెరవేర్చి తన తండ్రి చివరికి మాటను నిలబెడతాను అంటూ మాట ఇచ్చి, మేడం మీద తనకు సంపూర్ణ నమ్మకం, విశ్వాసం ఉందని, ఆమె నిర్ణయాన్ని గౌరవిస్తూ, ఎప్పుడు ఆమెకు తానూ విధేయుడిగా ఉంటానంటూ పెద్ద పెద్ద వాగ్దానాలు చేశారు.

కట్ చేస్తే..,ఒకప్పుడు “ఇండియన్ నేషనల్ కాంగ్రెస్” పార్టీగా ఉండే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు “ఇటాలియన్ నేషనల్ కాంగ్రెస్” పార్టీలా మారిపోయింది అంటూ ఎందుకు మాట మార్చారో..? నియంత అంటే అందరికి గుర్తొచ్చే పేరు సోనియా గాంధీ అని ఎందుకు మడం తిప్పారో..? తన తండ్రికి రెండు పర్యాయాలు ముఖ్యమంత్రి అవకాశం కల్పించిన కాంగ్రెస్ పార్టీ ఋణం ఈరకంగా జగన్ తీర్చుకున్నాడా..?లేక తనకు, తన కుటుంబానికి రాజకీయ ఎదుగుదలను కల్పించిన కాంగ్రెస్ పార్టీకి జగన్ వెన్నుపోటు పొడిచి సరైన న్యాయం చేశారని సమర్థిస్తారా..? సదరు మద్దతుదారులు సెలవిస్తే బాగుంటుంది.

కాంగ్రెస్ పార్టీకి ఈ రకమైన షాక్ ఇచ్చిన జగన్ బీజేపీ పై కూడా ఇలానే మాట మార్చి మడం తిప్పారు. “ఈ విషయం గుర్తుపెట్టుకోండి తరువాత మాట్లాడదాం”…బిఫోర్ ఎల్లక్షన్స్, ఆఫ్టర్ ఎలక్షన్స్…బీజేపీ కి మద్దతిచ్చే ప్రసక్తే లేదు అంటూ ఖరాకండిగా చెప్పిన జగన్ అధికారంలోకి వచ్చాక బీజేపీ పెద్దల ముందు దాసోహం తప్ప మరో దారి లేదని రాష్ట్రానికి కేంద్ర సహాయం కావలి అంటూ తెగేసి చెప్పారు. మరి బీజేపీ పట్ల ఇంతటి త్యాగానికి సిద్ధపడ్డ జగన్ నిజంగా “త్యాగరాజే” అవుతారేమో.

తెలంగాణ ప్రజల సెంటిమెంట్ ను గౌరవిస్తున్నా…అంటూనే తెలంగాణ ప్రజలకు మాట ఇచ్చిన జగన్ ఉమ్మడి ఏపీలో 30 ఎంపీ స్థానాలను గెలిపిస్తే సమైక్యాంధ్రకు ఎవరు మద్దతుగా నిలిస్తే వారినే దేశ ప్రధానిగా చేద్దాం అటు తెలంగాణ ప్రజలకు వెన్నుపోటు పొడిచి చివరికి వాళ్ళతోనే రాళ్ల దెబ్బలు తిని తెలంగాణలో వైసీపీ జెండా పీకేశారు. అలాగే ఏపీ ఎన్నికలలో ప్రజలకు ఇచ్చిన ప్రత్యేక హోదా, పోలవరం, రాజధాని, ప్రభుత్వ ఉద్యోగుల సీపీఆర్స్ రద్దు, మధ్య నిషేధం వంటి సాధ్యం కానీ హామీలిచ్చి ఇప్పుడు U టర్న్ తీసుకుంది జగన్ ప్రభుత్వం.

జగన్ తీసుకున్న ఇన్ని U టర్న్ లను చూసిన జగన్ అభిమానులు కూడా జగన్ పై తమకున్న అభిమానాన్ని U టర్న్ తీసోకావాల్సిందే అనుకుంటా. కనీసం జగన్ తీసుకున్న ఇన్ని U చూసిన తరువాతైనా టీడీపీ – జనసేన పొత్తు పట్ల చిల్లర రాజకీయ విమర్శలను కట్టిపెడతారో లేక మెం పట్టిన కుందేలుకు ముందే కాళ్ళంటూ ముందుకెళ్లి చేతులు కాల్చుకుంటారో మరి కొన్ని రోజులలో తేలనుంది.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Recent Posts

బూతులు కూడా తిట్టారటగా.. సగం సగం చెప్తే ఎలా సాయి?

వైసీపీ మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి ఇటీవల సోషల్ మీడియాలో పెద్ద లేఖ పోస్ట్ చేశారు. దానిని పూర్తిగా సజ్జల…

21 minutes ago

Dhurandhar Ruined Spy Universe: Is Karthi Next in Line?

Recently, the trailer of Karthi's most anticipated sequel Sardar 2 directed by PS Mithran, was…

28 minutes ago