జగన్‌ ఎందుకు మేలు చేయాలనుకొంటున్నారు?

సమైక్య రాష్ట్రానికి, విభజిత ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఏమి చేశారో ఆయన విరోధులు కేసీఆర్‌, జగన్మోహన్‌ రెడ్డి వంటివారికి కూడా బాగా తెలుసు. ఐ‌టి రంగంలో ఆయన ఆలోచనలు, చేసిన కృషి వలన ఒకప్పుడు సామాన్య మద్యతరగతి కుటుంబాలకు చెందిన యువత ఉన్నతస్థాయికి ఎదిగారు.

అలాగని చంద్రబాబు నాయుడు ఏమీ ఐ‌టి రంగాన్ని కనిపెట్టలేదు. అంతకు ముందు చాలా ఏళ్ళ నుంచే దేశ విదేశాలలో ఉంది. కానీ అంతకు ముందు పాలకులు ఎవరూ ఐ‌టి రంగాన్ని రాష్ట్రానికి తీసుకురావలనే ఆలోచన చేయలేదు. కానీ చంద్రబాబు నాయుడు దూరదృష్టితో ఆలోచిస్తుంటారు.

ADVERTISEMENT

అందుకే మొదట్లో అనేక ఇబ్బందులు, విమర్శలు ఎదుర్కొన్నా చంద్రబాబు నాయుడు హైదరాబాద్‌లో ఐ‌టి రంగానికి గట్టి పునాది వేశారు. ఆనాడు చంద్రబాబు నాయుడు వేసిన ఆ బలమైన ఐ‌టి పునాది వలననే నేటికీ రెండు తెలుగు రాష్ట్రాలలో లక్షలాది కుటుంబాలు పేదరికం నుంచి బయటపడుతున్నాయంటే అతిశయోక్తి కాదు.

అందుకే చంద్రబాబు నాయుడుని జగన్‌ ప్రభుత్వం జైల్లో పెట్టి వేధిస్తున్నప్పుడు హైదరాబాద్‌తో సహా దేశవిదేశాలలో ఐ‌టి ఉద్యోగులు రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలిపారు. నిన్న ఆయన పుట్టినరోజునాడు రోడ్లపైకి వచ్చి చంద్రబాబు నాయుడుకి శుభాకాంక్షలు తెలిపారు. ఇలాంటి ప్రేమ, అభిమానం డబ్బు పెట్టి కొనలేము.

చంద్రబాబు నాయుడుని ఎంతగానో ద్వేషించే కేసీఆర్‌ కూడా ఐ‌టి రంగం అభివృద్ధిలో మరో ఆలోచన చేయలేదు. చేసి ఉంటే నేడు ఏపీకి, తెలంగాణకు పెద్ద తేడా ఉండేది కాదు. నేటికీ బెంగళూరే దేశ ఐ‌టి రాజధానిగా ఉండేది.

కేవలం 20 ఏళ్లలోనే వేలకోట్లు ఆస్తులు సంపాదించుకున్న జగన్మోహన్‌ రెడ్డికి ఐ‌టి, సేవా రంగాల ద్వారా సంపద సృష్టించవచ్చని, లక్షల ఉద్యోగాలు కల్పించవచ్చనే విషయం తెలియదనుకోలేము.

కానీ సంపద సృష్టించి పంచి పెట్టడం, ప్రజలు తమ కాళ్లపై తాము నిలబడిగలిగేల చేయడం కంటే, ప్రజలను ప్రభుత్వంపైనే ఆధారపడి ఉంచడమే మంచిదనుకున్నారు.

సంక్షేమ పధకాలనే మత్తుమందుని ప్రజలకు అలవాటు చేసేస్తే ఇక ఎన్నటికీ ప్రభుత్వంపైనే ఆధారపడి జీవిస్తారు. వాటి కోసం మరో ఆలోచన చేయకుండా మళ్ళీ మళ్ళీ వైసీపినే గెలిపిస్తారని జగన్‌ ఆలోచనగా కనిపిస్తోంది. దానినే తూచా తప్పకుండా పాటిస్తున్నారు కూడా.

ఈవిదంగా ఫ్యూడల్ విధానం అమలుచేస్తూ మళ్ళీ ‘ఈ ఎన్నికలు పేదలకు, పెత్తందారులకు మద్య జరిగే క్లాస్ వార్’ అని చెప్పడం జగన్‌కే చెల్లునేమో?

ఒకప్పుడు వెనిజులా చాలా సంపన్న దేశం. కనుక ప్రభుత్వం ఇలాగే ఏదో పేరుతో ప్రజల చేతిలో డబ్బు పెట్టేది. దాంతో వెనిజులా ప్రజలు పనిచేయడం మానుకొని ప్రభుత్వంపై ఆధారపడసాగారు. కానీ చివరికి ఈ ఆర్ధిక భారం భరించలేక ఆ దేశ ఆర్ధ వ్యవస్థ కుప్పకూలిపోయింది. ఇప్పుడు ప్రపంచంలో పేద దేశాలలో వెనిజులా కూడా ఒకటి.

రేపు ఆంధ్రప్రదేశ్‌ పరిస్థితి కూడా ఇలాగే మారుతుందని ఆర్ధిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత 5 ఏళ్ళుగా రాష్ట్రంలో 98 శాతం మందికి ‘మేలు’ చేశామని జగన్‌ చెప్పుకుంటారు. రాష్ట్రంలో 98 శాతం మందికి మేలు జరిగి వారి జీవితాలలో వెలుగులు నింపి ఉంటే ఇంకా సంక్షేమ పధకాలు కొనసాగించాల్సిన అవసరం ఏమిటి?మళ్ళీ గెలిపిస్తే ఇంకా అనేక కొత్త పధకాలు అమలుచేస్తామని ఎందుకు చెపుతున్నారు?

ప్రతిపక్షాలు కూడా ఈ సంక్షేమ పధకాల పోటీలో ఎందుకు పాల్గొనవలసివస్తోంది? అంటే మధ్యాహ్నం తిన్న భోజనం రాత్రికి, రాత్రి తిన్న భోజనం ఉదయానికి ఏవిదంగా అరిగిపోయీ మళ్ళీ ఆకలివేస్తుందో, ఈ సంక్షేమ పధకాలతో జరిగే ‘మేలు’ కూడా అటువంటిదే అని భావించవచ్చు.

కనుక ప్రజలు ప్రభుత్వంపై ఆధారపడేలా చేసి వారిని ఎదగనీయకుండా అడ్డుకొంటున్న వైసీపి విధానాలు సరికాదని, ఐ‌టి, పరిశ్రమలు, వాణిజ్య సంస్థలు తీసుకువచ్చి వచ్చి ఉద్యోగాలు, ఉపాధి కల్పించి వారి కాళ్లపై వారు నిలబడగలిగేలా చేసే టిడిపి విధానాలే సరైనవని స్పష్టమవుతోంది. కనుక ఆంధ్రప్రదేశ్‌ మరో వెనిజులా మరో శ్రీలంక కాకూడదనుకుంటే ఈసారి అభివృద్ధికే మన ఓటు!

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Recent Posts

Why Prabhas, Mahesh, AA, Ram Charan, NTR Avoid Dasara?

Festival releases are usually a dream for film producers for better openings and a chance…

23 minutes ago

RR Star’s New Skill a Joke? Desperate Move or Disaster

Yashasvi Jaiswal has started working on wicketkeeping ahead of the 2026-27 Ranji Trophy season, but…

53 minutes ago