Telugu

షర్మిలకు మాత్రమే…

బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, మోడీ షాల నిర్ణయాలను విమర్శించగలిగే సత్తా ఏపీలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిలకు మాత్రమే దక్కిన అవకాశంగా చెప్పవచ్చు. ఎన్డీయే లో భాగంగా అటు టీడీపీ కానీ ఇటు జనసేన కానీ బీజేపీ నిర్ణయాలకు మద్దతు పలకాల్సిన పరిస్థితి.

ఇక జగన్ మీద ఉన్న అక్రమ కేసుల నేపథ్యంలో వైసీపీ బీజేపీ కి ఎదురెళ్ళే సాహసం చేయజాలదు. ఇలా ఏపీలో అధికార, ప్రతిపక్ష పార్టీలు ఈ ఒక్క విషయంలో మాత్రమే ఏకాభిప్రాయంతో ముందుకెళుతున్నాయి.

ADVERTISEMENT

అయితే ఏపీ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలిగా ఉన్న షర్మిల మాత్రం ప్రధాని నరేంద్ర మోడీ ని సైతం బలంగా ప్రశ్నించగలుగుతుంది, అలాగే బీజేపీ పై పదునైన విమర్శనా బాణాలను ఎక్కుపెట్టగలుగుతుంది. ఈ నేపథ్యంలో అమరావతి పునర్నిర్మాణ పనుల ప్రారంభానికి గాను మోడీ మే 2 న ఏపీలోని అమరావతిలో పర్యటనించనున్నారు.

అయితే మోడీ పర్యటన మీద షర్మిల బీజేపీ పై కొన్ని ప్రశ్నలను సంధించారు. అయితే ఆమె బీజేపీ ని అడిగిన ప్రశ్నలు, మోడీ పై చేసిన ఆరోపణలు వాస్తవానికి సగటు ఏపీ ప్రజల మనసులో ఉన్నవే అని చెప్పవచ్చు. 2015 అక్టోబర్ 22 న ఉద్దండరాయునిపాలెం గ్రామంలో మోడీ చేతుల మీద ఏపీ రాజధానికి శంకుస్థాపన చేపించారు సీఎం బాబు.

అయితే నాడు విభజన గాయాలతో, ఆర్థిక ఇబ్బందులతో, ఎదుర్కున్న అవమానం భారాలతో తలకు మించిన బరువుని మోస్తున్న ఏపీ ప్రజలు కేంద్ర సాయం కోసం గంపెడాశలతో ఎదురు చూసారు. అయితే నాడు ఏపీ ప్రజల ఆశల పై గుప్పెడు నీళ్లు, గప్పెడు మట్టి పోశారు మోడీ. ఇక అక్కడి నుంచి మొదలైన రాజధాని ప్రయాణం నేటికీ గమ్యానికి చేరుకోలేకపోయింది.

అయితే ఈసారి కూడా సీఎం గా బాబు, ప్రధాని మోడీ చేతుల మీదుగానే అమరావతి పనులను తిరిగి ప్రారంభించాలని సంకల్పించారు. అయితే ఇప్పుడే ఇదే అంశం మీద షర్మిల మోడీ పై విరుచుకుపడుతున్నారు. నాడు గప్పెడు మట్టి, గుప్పెడు నీళ్లు ఇచ్చి చేతులు కడుక్కున్న మీరు ఇప్పుడు మరోసారి ఏపీ ప్రజలను మోసం చేయడానికి వస్తున్నారా.?

ఇప్పుడు రాజధాని నిర్మాణాల పై కాస్త సున్నం కొట్టిపోతారా.? సాయం చేస్తారా.? మోడీ చేతుల మీదుగా మొదలైన అమరావతి ఇప్పటి వరకు అనేక ఆటంకాలను ఎదుర్కొంటు ఎన్నో అవమానాలను చవి చూసింది, ఇప్పుడు మరోసారి మోడీ పునః ప్రారంభించనున్న అమరావతికి ఈసారైనా రాజధానిగా పట్టాభిషేకం జరుగుతుందా.? అంటూ షర్మిల మోడీ పర్యటన మీద ప్రశ్నలు కురిపించారు.

అయితే ఏపీ ప్రజల తరుపున కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీ పై, ఆ ప్రభుత్వ పెద్దల పై షర్మిల సంధించిన బాణాలు సహేతుకమే అయినప్పటికీ అసలు ఏపీ కి ఈ పరిస్థితి దాపరించడానికి, ఇలా అందరి ముందు అవమాన భారంతో ఏపీ తల వంచడానికి, కేంద్రం ముందు సాయం కోసం చేతులు చాచడానికి అసలు కారణం షర్మిల ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీనే అన్న సంగంతి ఆమె మరిచారు.

అయితే నేను ఆడపిల్లను ఈడ సమస్యలు, ఇక్కడి ప్రాంత ప్రజల మనోభావాలు నాకు పట్టవు అంటూ నాడు తెలంగాణలో రాజకీయం చేసిన షర్మిల, ఇప్పుడు నేను ఈడ పిల్లనే ఇక్కడి ప్రజల సమస్యలు తీర్చేది, ఇక్కడి ప్రజలు కోసం పోరాటం చేసేది నేనే అన్నట్టుగా వ్యవహరించడం, రాజకీయం చేయడం ఒక్క షర్మిలకు మాత్రమే సాధ్యం సుమీ..!

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Egilivaranga From Bhogi: A Soulful, Lively Folk Song

Sharwa is coming up with the rural period action drama Bhogi. Directed by Sampath Nandi…

14 minutes ago

Katrina Kaif Has a Message for Social Media Critics

Katrina Kaif is in a new phase of life after becoming a mother, but her…

20 minutes ago