Telugu

ఉద్యోగుల నోళ్ళు మూయించినా… కేసీఆర్‌తో పోటీ పడక తప్పదుగా!

ఏపీలో ప్రభుత్వోద్యోగులు ప్రభుత్వం పోరాటాలు మొదలుపెట్టగా వారిలో చీలికలు సృష్టించి, కొందరు ఉద్యోగ సంఘాల నేతలపై కేసులు నమోదు చేసి మొత్తం మీద అందరినీ అదుపులోకి తెచ్చుకొంది. ఆనాడు సినీ ప్రముఖుల చేత పొగిడించుకొన్నట్లే, తనను విమర్శించిన ఉద్యోగసంఘాల నేతలతోనే పొగిడించుకొన్నారు. జిపిఎస్సే మాకు చాలని వారిచేత అనిపించారు. జగనన్న పాలన, ఆయన అమలుచేస్తున్న సంక్షేమ పధకాలు నభూతో నభవిష్యత్ అని వారి నోటే అనిపించారు.

ఇప్పుడు రాష్ట్రంలో ఉద్యోగ సంఘాల నేతలెవరూ యూనియన్ సమావేశాలు నిర్వహించుకోవాలన్నా ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవలసిందే. ఇక సమ్మెలు, జీతాల కోసం ఆందోళనలు, ఛలో విజయవాడ గురించి కలలో కూడా ఆలోచించలేరు.

ADVERTISEMENT

అయితే ఉద్యోగుల నోళ్ళు మూయించగలిగింది కానీ వారి మనసులో ప్రభుత్వం పట్ల ఉన్న వ్యతిరేకతను తుడిచేయలేదు కనుక అధికార పార్టీ నేతలు, ఉద్యోగ సంఘాల నేతలతో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించి బిర్యానీలతో సంతృప్తి పరిచేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ ఇవాళ్ళ తిన్న బిర్యానీ రేపటికి అరిగిపోతుందని గ్రహించిన్నట్లు లేదు! అది వేరే విషయం.

ప్రభుత్వోద్యోగులను ఏదోవిదంగా కట్టడి చేసి అందరి నోళ్ళు మూయించినప్పటికీ, తెలంగాణ వైపు నుంచి కొత్త సమస్య వచ్చిపడింది. తెలంగాణ సిఎం కేసీఆర్‌ రెండు మూడు రోజుల క్రితమే ప్రభుత్వోద్యోగులకు డీఏ 2.73% పెంచారు. మళ్ళీ ఇవాళ్ళ అనేక వరాలు కురిపించారు.

ఉద్యోగుల ట్రావెలింగ్ అలవెన్స్ ఒకేసారి 30 శాతానికి పెంచారు. ఇంకా ఇళ్ళు, వాహనాల కొనుగోలుకు, పిల్లల పెళ్ళిళ్ళకు ఇచ్చే అడ్వాన్స్‌లను చాలా భారీగా పెంచారు. దాదాపు అన్ని శాఖలలో, అన్ని విభాగాలలో ప్రభుత్వోద్యోగులందరికీ భారీగా జీతాలు పెరిగేలా చేశారు.

తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం ఏపీ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడం ఖాయమే. తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న వాటన్నిటినీ చూసి ఏపీలో ప్రభుత్వోద్యోగులలో అసంతృప్తి ఇంకా పెరిగిపోవచ్చు. అయితే ప్రస్తుతం ఎవరూ నోరు విప్పి గట్టిగా అడగలేని పరిస్థితిలో ఉన్నందున, ఆ అసంతృప్తిని ఎన్నికలలో ఓట్ల రూపంలో వెలిబుచ్చడం ఖాయం. కనుక ఇప్పుడు కాకపోయినా ఏపీలో ఎన్నికల గంట మ్రోగినప్పుడైనా జగన్ ప్రభుత్వం ఉద్యోగులకు వరాలు ప్రకటించకతప్పదు. అయితే ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉంది కదా… నో వర్రీస్!

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Kappi Squad Review: Average but Watchable Urban Comedy

BOTTOM LINE Average but Watchable Urban Comedy PLATFORM JioHotstar RUNTIME 1 Hour 73 Mins (4…

5 minutes ago

King 100: Nagarjuna’s Strong Take on Pan India

Nagarjuna’s upcoming film King 100 is currently planned as a Telugu film and not a…

20 minutes ago