
ప్రభుత్వ శాఖలన్నింటికీ ఉపయోగపడటమే లక్ష్యంగా ఈ సర్వేను ఏపీ సర్కార్ చేపట్టింది. సుమారు రెండు నెలల క్రితం చేపట్టిన ఈ కార్యక్రమం తుది దశకు చేరిన వేళ, తిరిగి ఇంటింటికీ తిరగాల్సి వచ్చిందని, అధికారుల మధ్య సమన్వయం లోపాలు తమకు మళ్లీ వీధుల్లో తిరగాల్సిన పని పెట్టాయని సర్వే ఉద్యోగులు వాపోయారు. వాస్తవానికి సర్వే ప్రారంభ సమయంలో కుటుంబ పెద్ద వేలిముద్ర సేకరిస్తే సరిపోతుందని చెప్పగా, తామూ అదే పని చేశామని, ఇప్పుడు భవిష్యత్ అవసరాలంటూ, అందరి వేలిముద్రలూ కావాలని స్పష్టం చేస్తున్నారని అంటున్నారు.
బుధవారం సాయంత్రానికి 1.16 కోట్ల మంది వివరాలు సేకరించి వుండగా, వీరిలో దాదాపు 25 లక్షల మంది వేలిముద్రలు మాత్రమే డేటాలో ఉన్నాయి. ఇప్పుడు మిగతా వారందరి వేలిముద్రలనూ సేకరించాల్సి వుంది. అదీ గాక, పట్టణాలలో అందరూ అందుబాటులో ఉండకపోవడంతో ఒకే ఇంటికి రెండు, మూడు సార్లు తిరగాల్సిన పరిస్థితులు తలెత్తుతున్నాయని, అలాగే గ్రామీణ ప్రాంతాల్లో ఉంటున్న వారు ఉద్యోగాల రీత్యా పని వేళల్లో పట్టణ ప్రాంతాల్లో ఉంటున్నారని, ఇప్పుడు వీరందరి వేలిముద్రల సేకరణ అంటే… అది తలకు మించిన భారంగానే మారుతుందని అధికారులు గగ్గోలు పెడుతున్నారు.
Allu Arjun’s Forbes India feature was meant to highlight his growing pan-India popularity. Instead, a…
For Allari Naresh, Ramba Oorvasi Menaka is more than just another comedy outing. It marks…