
ఆరోగ్య శ్రీ వైద్య సేవలు అందిస్తున్న కార్పొరేట్ ఆసుపత్రులు రూ.1,500 కోట్లు బకాయిలు చెల్లించనందుకు వైద్య సేవలు నిలిపివేస్తామని ఇటీవలే ఆరోగ్యశ్రీ ట్రస్టు సీఈవోకి లేఖ ద్వారా తెలియజేశాయి. అయితే ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోలేదని, యదాతదంగా కొనసాగుతున్నాయని ప్లానింగ్ బోర్డు అధ్యక్షుడు, వైసీపి ఎమ్మెల్యే మల్లాది విష్ణు చెప్పారు. టిడిపి, బీజేపీ నాయకులు పనిగట్టుకొని ఆరోగ్యశ్రీపై దుష్ప్రచారం చేస్తుంటే వారి అనుకూల మీడియా వాటిని రాష్ట్రమంతా వ్యాపింపజేస్తోందని ఆరోపించారు.
తమ ప్రభుత్వం ఈ ఆర్ధిక సంవత్సరంలో ఆరోగ్యశ్రీ ఆసుపత్రులకు రూ.366 కోట్లు, మళ్ళీ ఇటీవల మరో రూ.200 కోట్లు విడుదల చేసిందని మల్లాది విష్ణు చెప్పారు. తమ ప్రభుత్వం పేదలకు కార్పొరేట్ వైద్యం అందిస్తుంటే టిడిపి, బీజేపీలు ఓర్వలేక తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు.
రాష్ట్ర ప్రభుత్వం రూ.1,500 కోట్లు బకాయిలు చెల్లించకపోతే ఆరోగ్యశ్రీ వైద్య సేవలను నిలిపి వేస్తామని ఈ నెల 22న ఆసుపత్రుల అసోసియేషన్ ప్రభుత్వాన్ని హెచ్చరించినప్పుడు, మర్నాడు ట్విట్టర్లో “రాజకీయాలకు అతీతంగా ఏపీలో జగనన్న పాలన’ అంటూ సోషల్ మీడియాలో జగన్ ఫోటోతో వైసీపి ఓ సందేశం పెట్టింది.
దానిలో ఆరోగ్యశ్రీ వైద్య సేవలు నిలిపివేసే ఆసుపత్రులపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, ఈ మేరకు జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు కూడా జారీ చేశామని వైసీపి పేర్కొంది.
అంటే ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేయడం నిజమే అని స్పష్టం అయ్యింది. కానీ మల్లాది విష్ణు మరోలా చెపుతున్నారు. ఇంతకీ సేవలు నిలిచిపోవడం, ప్రభుత్వం ఆసుపత్రి యాజమాన్యాలను బెదిరించడం నిజమా? లేక రూ.200 కోట్లు బకాయిలు చెల్లించి మళ్ళీ వైద్య సేవలు కొనసాగించడం నిజమా? అనే ప్రశ్నకు ఆయనే సమాధానం చెప్పాల్సి ఉంటుంది.
పోలింగ్ ముందు రోజున చంద్రబాబు నాయుడు అడ్డుపడకపోయి ఉంటే సంక్షేమ పధకాలు ఏకంగా రూ.14,000 కోట్లు ఇచ్చేయాలని ఆరాటపడిన జగన్ ప్రభుత్వం, ఆరోగ్యశ్రీ ఆసుపత్రులకు రూ.1500 కోట్లు బకాయిలు ఎందుకు చెల్లించలేకపోయింది? రూ.1500 కోట్లు బకాయిలు ఉంటే దానిలో రూ.200 కోట్లు మాత్రమే చెల్లించింది?మిగిలిన మొత్తం ఎప్పుడు, ఎవరు చెల్లిస్తారు?
Vijay Deverakonda is confident about his comeback with Ranabaali and has a strong message for…
YS Jagan has been very successful when it comes to mitigating the legal and judicial…