మతం పుచ్చుకుంటే కులం వదులుకోవలసిందే!

దేశంలో అత్యధికంగా మత మార్పిడి జరుగుతున్న రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్‌ అగ్రస్థానంలో ఉంది. బడుగు బలహీన వర్గాలు పేదిరికం, ఆర్ధిక సమస్యలు, సమాజంలో ఇతర కులస్థుల నుంచి గౌరవం లభించకపోవడం వంటి అనేక కారణాలతో మత మార్పిడికి మొగ్గు చూపుతుంటారు.

కానీ మతం మార్చుకున్నా విద్యా, ఉద్యోగాలలో రిజర్వేషన్స్ పొందేందుకు, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాల ద్వారా రక్షణ పొందేందుకు గాను ఎవరూ తమ కులాన్ని వదులుకోవడానికి ఇష్టపడరు.

ADVERTISEMENT

సమాజంలో ఉన్నత కులాలలో వారు కూడా వివిద కారణాలతో మత మార్పిడి చెందుతుంటారు. వారు కూడా తమ కులం వదులుకోకుండా ఆ కులంలోనే పెళ్ళిళ్ళు చేసుకుంటుంటారు.

అన్యమతాలలో చేరినవారు కుల ప్రయోజనాలు, రక్షణ, గుర్తింపు వదులుకోకపోవడంపై చాలా కాలంగా వాదోపవాదాలు జరుగుతూనే ఉన్నాయి.

ఓ కేసు విచారణలో ఏపీ హైకోర్టు క్రీస్టియన్ మతం స్వీకరించిన వారికి తక్షణమే వారి కులం రద్దవుతుందని, కనుక ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద వారు రక్షణ పొందలేరని స్పష్టం చేసింది.

కేవలం హిందూ మతంలో మాత్రమే కులాలు ఉన్నాయని, ఇతర మతాలలో కులాలు లేవని హైకోర్టు గుర్తు చేసింది. హిందూ మతం నుంచి క్రీస్టియన్ మతంలో చేరుతున్నవారు, తమ కులం వదులుకొని చేరినట్లే కనుక వారికి ఎస్సీ,ఎస్టీ చట్టాలు వర్తించవని ఏపీ హైకోర్టు సంచలన తీర్పు చెప్పింది.

ఉమ్మడి గుంటూరు జిల్లాలో కొత్త పాలెం గ్రామంలో ఎస్సీ వర్గానికి చెందిన చింతాడ ఆనంద్‌ క్రీస్టియన్ మతం పుచ్చుకొని, గత పదేళ్ళుగా స్థానిక చర్చిలో పాస్టర్‌గా చేస్తున్నారు. 2021 లో అదే గ్రామానికి చెందిన కొందరు దాడి చేశారు. ఆయన పిర్యాదు చేయగా పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద వారిపై కేసు నమోదు చేశారు. ఆ కేసు విచారణలోణే హైకోర్టు ఈ సంచలన తీర్పు చెప్పింది.

చట్టాన్ని అమలుచేసే పోలీసులు కూడా చట్టంలోని ఇటువంటి అంశాలను పట్టించుకోకుండా క్రీస్టియన్ మతం పాటిస్తున్నవారిని ఎస్సీ, ఎస్టీ తదితర కులాలకు చెందినవారిగానే పరిగణించడం, వారికి ఎస్సీ, ఎస్టీ చట్టాలను వర్తింపజేస్తూ కేసులు నమోదు చేయడం తప్పని ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది.

ఈ తీర్పు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాలకు మాత్రమే పరిమితమని అనుకోలేము. కులం పేరుతో విద్యా, ఉద్యోగాలలో రిజర్వేషన్స్‌కు కూడా ఇదే తీర్పు వర్తిస్తుంది.. కదా?

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

వారి ఆరాటం.. ప్రజాస్వామ్యం కోసమా. ఓటు బ్యాంకు కోసమా?

ఎస్ఐఆర్ పేరుతో దేశంలో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం లేదా కేంద్ర ఎన్నికల కమీషన్‌ కలిసి నిర్వహిస్తున్నయా?…

3 minutes ago

So Many Rejections, Nani Must Be Cautious!

Nani's latest film The Paradise marked one of the most ambitious attempts of his career.…

31 minutes ago