Telugu

ఇలా ఉద్యోగాలు భర్తీ చేస్తుంటే.. అవుననేలేదు… కాదనలేదు!

గత వైసీపీ ప్రభుత్వం సంక్షేమ క్యాలెండర్ విడుదల చేసి దాని ప్రకారం సంక్షేమ పథకాల నిధులు విడుదల చేసేది. కానీ కూటమి ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ విడుదల చేసి దాని ప్రకారం ప్రభుత్వోద్యోగాలు భర్తీ చేస్తోంది. రెండూ క్యాలెండర్లే. కానీ మొదటిది ప్రజలు ఎప్పటికీ ప్రభుత్వంపై ఆధారపడేలా చేస్తే, రెండోది ఎవరి కాళ్ళపై వారు నిలబడేలా చేస్తోంది.

జాబ్ క్యాలెండర్‌లో పేర్కొన్న విధంగానే కూటమి ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఖాళీ అవుతున్న పోస్టులకు నోటిఫికేషన్లు జారీ చేస్తోంది. అలాగని ఏళ్ళ తరబడి ఈ ప్రక్రియను సాగదీయకుండా 3-6 నెలల్లోగానే మొత్తం ప్రక్రియను పూర్తిచేస్తోంది.

ADVERTISEMENT

తాజాగా హోంశాఖ పరిధిలోని పోలీసు, అగ్నిమాపక, జైళ్ల శాఖల్లో 1,534 పోస్టుల భర్తీకి రాష్ట్ర పోలీసు నియామక మండలి ఛైర్మన్ రాజీవ్ కుమార్ మీనా గురువారం నోటిఫికేషన్ విడుదల చేశారు.

ఉద్యోగాల వివరాలు:

సబ్ ఇన్‌స్పెక్టర్ పోస్టులు: 378, సివిల్ ఎస్ఐ: 253, రిజర్వ్ సబ్ ఇన్‌స్పెక్టర్ (ఏఆర్): 116, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (ఎస్పీఎఫ్): 9 పోస్టులు ఉన్నాయి.

వీటిలో సివిల్, ఏఆర్ విభాగాల్లో పురుషులతో పాటు మహిళలు కూడా అవకాశాలు కల్పించారు. కానీ ఎస్పీఎఫ్ పోస్టులు మాత్రం పురుషులకు మాత్రమే కేటాయించారు.

సివిల్ కానిస్టేబుల్ పోస్టులు: 542, ఆర్మ్డ్ రిజర్వ్ కానిస్టేబుల్: 285,

అగ్నిమాపక శాఖలో ఫైర్‌మెన్: 158 ,

జైళ్ల శాఖలో పురుష వార్డర్: 150, మహిళా వార్డర్: 21 పోస్టులు కలిపి మొత్తం 1,156 పోస్టులు భర్తీ చేయనున్నారు.

దరఖాస్తు ప్రక్రియ: నవంబర్ 27 నుంచి డిసెంబర్ 16 ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

పరీక్షా సమయం:

కానిస్టేబుల్, ఫైర్‌మెన్, వార్డర్ పోస్టులకు ప్రాథమిక రాత పరీక్ష: 2027, జనవరి 31న.

సబ్ ఇన్‌స్పెక్టర్ పోస్టులకు ప్రాథమిక రాత పరీక్ష 2027, ఫిబ్రవరి 28న.

అర్హతలు, వయోపరిమితి, విద్యార్హతలు, దరఖాస్తు విధానం వంటి పూర్తి వివరాలను అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ https://slprb.ap.gov.in లో తెలుసుకోవచ్చు. దరఖాస్తు చేసుకున్న తర్వాత అప్లికేషన్ కాపీని భవిష్యత్తు అవసరాల కోసం భద్రపరుచుకోవాలని నియామక మండలి సూచించింది.

కూటమి ప్రభుత్వం ఎక్కడా గ్యాప్ ఇవ్వకుండా ప్రతీ రెండు నెలలకు ఇలా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేస్తుంటే వైసీపీకి చాలా కష్టమే. ఎందువల్లనంటే, ఎదో ఒకసారి డీఎస్సీలో అవకతవకలు జరిగాయంటూ హడావుడి చేయగలదు. కానీ ప్రతీ ఉద్యోగాల భర్తీ ప్రక్రియను తప్పు పడుతూ వ్యతిరేకించలేదు. వ్యతిరేకిస్తే ఉద్యోగాలు భర్తీ చేయకుండా వైసీపీ అడ్డుకుంటోందని ప్రజలు భావిస్తే నష్టపోయేది అదే కనుక!

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

NTR-Anil Ravipudi: A Game Changer for Telugu Cinema?

For a long time, Anil Ravipudi has faced criticism on social media for the kind…

14 minutes ago

GV Prakash’s Blockbuster Call on January 12 Vidudala

Music director GV Prakash Kumar is looking to continue his successful Telugu run with January…

44 minutes ago