Telugu

ఢిల్లీ లిక్కర్, ఏపీ లిక్కర్… క్వాలిటీలో డిఫరెన్స్?

ఏపీ మద్యం కుంభకోణం కేసులో నిందితులకు చెందిన రూ.441.663 కోట్లు విలువైన స్థిర, చిరాస్తులు ఈడీ జప్తు చేసింది.

ఈ సందర్భంగా ఈ కేసు గురించి ఈడీ వెల్లడించిన వివరాలు ఇదివరకే ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో పుంఖానుపుంకాలుగా వచ్చాయి. కనుక ఈ కుంభకోణంలో ఎవరెవరున్నారు? ఏవిధంగా చేశారు?వంటి వివరాల జోలికి వెళ్ళాల్సిన అవసరం లేదు.

ADVERTISEMENT

ఢిల్లీ మద్యం, ఏపీ మద్యం… రెండు కేసులలో ఓ ప్రధాన తేడా కనిపిస్తోంది. ఢిల్లీ మద్యం కేసులో ఈడీ తన నుంచి ఒక్క రూపాయి కూడా రికవరీ చేయలేకపోయిందని కల్వకుంట్ల కవిత చెపుతున్నారు. తనకు న్యాయస్థానం క్లీన్ చిట్ ఇచ్చిందని చెప్పుకుంటున్నారు. అందుకు తిరుమల వెంకన్న మొక్కు కూడా చెల్లించేసుకున్నారు. కనుక ఆ కేసు క్లోజ్ అయిపోయినట్లే అని చెప్పేశారు.

కానీ ఏపీ మద్యం కేసులో నిందితులకు చెందిన రూ.441.663 కోట్లు విలువైన స్థిర, చిరాస్తులు ఈడీ జప్తు చేసింది. తద్వారా ఈ కేసులో భారీగా అవినీతి, అక్రమాలు జరిగాయని ధ్రువీకరించినట్లయింది.

భారీగా అవినీతి జరిగిందని చెపుతున్న ఈడీ దీనిని కోర్టులో నిరూపించి దోషులకు శిక్షలు పడేలా చేసినప్పుడే దాని విచారణకు అర్థం ఉంటుంది. ఈడీకి విశ్వసనీయత ఏర్పడుతుంది.

కానీ దేశ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు విషయంలో సీబీఐ చిత్తశుద్ధి చూపలేదని ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు స్పష్టంగా చెప్పినప్పుడు, ఈ ఏపీ మద్యం కేసులో అంతిమ లబ్దిదారు లేదా ప్రధాన సూత్రధారి వరకు ఈడీ ఎప్పటికైనా చేరుకోగలదా? అరెస్ట్ చేయగలదా? నేరస్తులకు శిక్షలు పడేలా చేయగలదా?అంటే అనుమానమే!

ఏపీ మద్యం కేసు విచారణ మొదలుపెట్టి ఏడాదిన్నర… మరో రెండేళ్ళు సాగితే ఆ తర్వాత ఏపీ శాసనసభ, లోక్‌సభ ఎన్నికల హడావుడి మొదలైపోతుంది. అప్పుడు రాజకీయ లెక్కలు మారుతుంటాయి. ఆలోగా విచారణ ముగియకపోతే రాజకీయాల కారణంగా ఈ కేసు కూడా అటకెక్కిపోవచ్చు. అలా జరగదని ఈడీ చెప్పదు. చెప్పలేదు కూడా. కనుక ఢిల్లీ లిక్కర్, ఏపీ లిక్కర్ వేర్వేరు బ్రాండ్స్ అయినప్పటికీ క్వాలిటీ (కేసుల్లో) డిఫరెన్స్ ఉండకపోవచ్చు.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Allu Arjun Must Lock Sandeep Reddy Immediately?

Allu Arjun is one of the biggest stars in Indian cinema at this point in…

5 minutes ago

Why Did India’s Captain Quit? Smriti Next?

Harmanpreet Kaur has stepped down as India women’s captain across all three formats, bringing an…

24 minutes ago