
AP local polls put YSRCP under scrutiny.
తాజాగా జరిగిన ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలలో కూటమి విజయపరంపర కొనసాగుతూ వస్తుంది. మున్సిపల్ ఛైర్ పర్సన్స్ నుంచి మేయర్, జడ్పీటీసీ, ఎంపీటీసీ పదవుల వరకు వైసీపీ పై కూటమి ప్రభంజనం సృష్టించింది. కూటమి విజయ ప్రభంజనం నుంచి జగన్ సొంత నియోజకవర్గమైన పులివెందుల కూడా మినహాయింపు పొందలేకపోయింది.
మొన్న పులివెందుల జడ్పీటీసీ ఉపఎన్నికల నుంచి నిన్న పులివెందుల మున్సిపాలిటీ, నేడు పులివెందుల జడ్పీటీసీ వరకు వైసీపీ రాజకీయ పతనం నిర్విరామంగా కొనసాగుతోంది. దీనితో స్థానిక ఎన్నికల ఫలితాలతో కూటమి పార్టీలు ‘దీపావళి వెలుగుల’తో పండుగ సంబరాలు జరుపుకుంటుంటే అటు వైసీపీ మాత్రం ఓటమి అవమానం కు తోడు పులివెందుల పరాజయం తో ‘అమావాస్య చీకట్ల’ను చూస్తుంది.
అయితే వైసీపీ పార్టీ ఈ స్థాయి ఓటమికి ఎవరిని నిందించాలి.? ఆ బాధ్యత ఎవరిదీ.? లోపం ఎక్కడ జరుగుతుంది..? అసలు వైసీపీ ని ప్రజలు ఇంతలా తిరస్కరించడానికి ఉన్న ప్రధాన రాజకీయ కారణాలు ఏమిటి.? నాటి సార్వత్రిక ఎన్నికల ఫలితాలకు నేటి స్థానిక సంస్థల ఫలితాలకు మధ్య వైసీపీ ప్రజలకు ఎందుకు చేరువకాలేకపోయింది.?
నాటి వైసీపీ ప్రభుత్వ పాలన కు సార్వత్రిక ఎన్నికల ఫలితాలు అద్దం పడితే, నేటి స్థానిక ఎన్నికల ఫలితాలు వైసీపీ ప్రతిపక్ష పాత్రకు ప్రజలు ఇచ్చిన రిఫరెండంగా భావించాలా.? అంటే వైసీపీ అటు అధికార పార్టీగాను ఇటు ప్రతిపక్షంగాను ఫెయిల్ అయినట్టేనా.?
వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ప్రజాభిమానాన్ని కోల్పోయి, ప్రతిపక్షంలోకి వచ్చిన తరువాత కూడా ప్రజల విశ్వాసాన్ని తిరిగి పొందలేకపోతుందా.? వరుస ఎన్నికల ఫలితాలు చెబుతున్నది ఇదేనా.? మరి ఈ రాజకీయ పతనానికి అడ్డుకట్ట వేసేదెవరు.? పార్టీలోని లోపాలను సరిచేసుకుంటూ పార్టీని రాజకీయంగా తిరిగి గాడిన పెట్టాల్సిన బాధ్యత ఎవరిదీ.? రప్ప రప్ప రాజకీయాలను ప్రోత్సహించే నాయకులకు ప్రజలు ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ ఇదేనా.?
Ranbir Kapoor is currently appearing as Lord Ram in Ramayana, and he has already got…
BOTTOM LINE Outdated, Amateurish Romance PLATFORM ZEE5 RUNTIME 2Hours What Is the Show About? Vinoth,…