Telugu

వైసీపీకి ఈ నమ్మకం కల్పించింది కూటమి పార్టీలే కదా?

స్థానిక సంస్థల ఎన్నికలలో మేయర్, మున్సిపల్ చైర్మన్‌, చైర్ పర్సన్ సీట్ల కోసం కూటమిలో మూడు పార్టీలు పట్లు పట్టాల్సిరావడం వైసీపీకి కలిసివచ్చే అంశమే.

ఒకవేళ మిత్ర పక్షాల ఒత్తిళ్ళకు తలొగ్గి టీడీపి (లేదా వైసీపీ) బలంగా ఉన్నచోట, బిజేపి, జనసేనలకు బలం లేని చోట వాటికి సీట్లు కేటాయిస్తే, ఆ సీట్లను పువ్వులలో పెట్టి వైసీపీకి అప్పగించినట్లే అవుతుంది.

ADVERTISEMENT

అలాగని కూటమిలో మిత్రపక్షాలకు ప్రాధాన్యం ఇవ్వరా? ఎప్పుడూ మీరు చెప్పినట్లే మేము వినాలా? ఇలా ఎంతకాలం? ఈసారి మేము కోరుకున్న సీట్లు మాకు ఇవ్వాల్సిందేనంటూ జనసేన ఎక్కువ ఒత్తిడి చేస్తోంది.

ఈ విషయంలో జనసేన అధిష్టానంపై ఓ పక్క కాపు సామాజికవర్గం ఒత్తిళ్ళు, మరోపక్క పవన్ కళ్యాణ్‌ అభిమానులు, జనసైనికుల ఒత్తిళ్ళు చాలా ఉన్నాయి.

ఇవికాక వారి శ్రేయోభిలాషుల ముసుగులో వైసీపీ వారిని వెనుక నుంచి రెచ్చగొడుతూనే ఉంది. కనుక సీట్ల విషయంలో తగ్గేదేలే అన్నట్లు సిఎం చంద్రబాబు నాయుడుపై ఒత్తిడి చేస్తున్నారు.

కనుక సీట్ల డిమాండ్, కేటాయింపుల విషయంలో టీడీపి, జనసేన రెండింటి వాదనలలో సహేతుకత కనిపిస్తోంది. ఒకవేళ జనసేన మరోసారి వెనక్కు తగ్గితే, దానిపై వచ్చే విమర్శలకు అంతే ఉండదు. ఈ విషయం జనసేనానికి బాగా తెలుసు. కనుక తమ పార్టీ నేతలు, కార్యకర్తల అభిమతం మేరకు సీట్ల కోసం టీడీపిపై ఒత్తిడి చేస్తున్నారనుకోవచ్చు.

కానీ ఈ స్థానిక సంస్థల ఎన్నికలలో జనసేన సముచిత స్థానాలు కోరుకోవడం ఎంత అవసరమో, పొందిన ప్రతీసీటును గెలుచుకోవడం అంతకంటే చాలా ముఖ్యం. టీడీపి, బిజేపిలకు కూడా ఇదే వర్తిస్తుంది.

శాసనసభ ఎన్నికల ముందు నుంచి వైసీపీ ఈ మూడు పార్టీల మద్య ఇలాంటి అసమ్మతి, అభిప్రాయబేధాలు ఏర్పరచాలని లేదా ఏర్పడాలని కోరుకుంటూనే ఉంది. ఇప్పుడు దాని ప్రయత్నం లేకుండా అలాగే జరుగుతోంది.

మొదట స్థానిక సంస్థల ఎన్నికలను ఎదుర్కోవడానికి భయపడిన వైసీపీ ఇప్పుడు ఈ మిత్రభేదాలను సద్వినియోగం చేసుకోక మానదు. కనుక ఈ ఎన్నికలలో ఓడిదిపోతామనే భయం నుంచి పూర్తిగా తేరుకొని ఇప్పుడు తప్పక గెలుస్తామనే నమ్మకం ఏర్పడటానికి కారణం కూటమి పార్టీలే అని చెప్పక తప్పదు.

కనుక నేడు సిఎం చంద్రబాబు నాయుడుతో జరుగుతున్న సమావేశంలో మూడు పార్టీలు పట్టువిడుపులు ప్రదర్శించి సరైన నిర్ణయం తీసుకుంటాయని ఆశిద్దాం.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

YSRCP Files Two Petitions in High Court Ahead of AP Local Body Elections

YSRCP Files Two Petitions in High Court Ahead of AP Local Body Elections

With local body elections approaching in Andhra Pradesh, the YSR Congress Party (YSRCP) has filed…

6 minutes ago

విశాఖ మేయర్ పీఠం.. ఆ జనరల్ మహిళ ఎవరు?

విశాఖ మేయర్ పదవిని జనరల్ మహిళకు కేటాయించడంతో రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి. అయితే టీడీపీ నుంచి నందమూరి బాలకృష్ణ…

51 minutes ago