
అనంతపురం జిల్లా పెనుగొండ మండలం ఎర్రమంచిలో 599 ఎకరాల్లో ప్లాంట్ ఏర్పాటు కానుంది. ఈ ప్లాంట్‌లో 11 వేల మందికి ప్రత్యక్షంగా ఉపాధి అవకాశాలు లభించనుండగా, పరోక్షంగా వేలాది మందికి ఉపాధి అవకాశాలు ఏర్పడనున్నాయి. అందులోనూ వెనకబడిన అనంతపురం జిల్లాలో పరిశ్రమను ఏర్పాటు చేసేందుకు కియా ముందుకు రావడంతో ఆ సంస్థకు అల్ట్రా మెగా ఇండస్ట్రీకి ఇచ్చే అన్ని ప్రోత్సాహకాలను ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.
మరో విశేషం ఏమిటంటే… ప్లాంట్ ఏర్పాటుకు ముందుకొచ్చిన కియా మరో రెండేళ్లలోనే అంటే 2019 నాటికే ప్రయోగాత్మకంగా కార్లను ఉత్పత్తి చేయాలని నిర్ణయించింది. అలాగే అక్టోబరు 2019 నాటికి పూర్తి స్థాయిలో కార్లను ఉత్పత్తి చేయాలని ఏపీ సర్కారు కూడా షరతు విధించింది. 1944లో ఏర్పాటైన కియా మోటార్స్ కంపెనీకి దక్షిణ కొరియాలోని సియోల్‌కు చెందిన సంస్థ. వాహన తయారీ రంగంలో దీనికి ప్రపంచంలోనే ఐదో స్థానం. దీంతో మరో ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ సొంతమయ్యింది.
Sumanth Prabhas and Ananthika Sanilkumar’s Romanchakam has received a major boost on its release day,…
చిత్రం: రోమాంచకం M9 రేటింగ్: 2/5 విడుదల తేదీ: సెప్టెంబర్ 03, 2026 తారాగణం: సుమంత్ ప్రభాస్, అనంతిక సానిల్…