Telugu

‘రోమాంచకం’ సినిమా రివ్యూ: ప్రేమరహితం, హాస్యభరితం, ఉత్కంఠలోపితం!

చిత్రం: రోమాంచకం

M9 రేటింగ్: 2/5

ADVERTISEMENT

విడుదల తేదీ: సెప్టెంబర్ 03, 2026

తారాగణం: సుమంత్ ప్రభాస్, అనంతిక సానిల్ కుమార్, నరేంద్ర రవి, ఉపేంద్ర తదితరులు

నిర్మాణ సంస్థ: భద్రకాళి పిక్చర్స్

దర్శకత్వం: వేణుగోపాల్ రెడ్డి

సంగీతం: వాసుకి వైభవ్

నిర్మాత: ప్రణయ్ రెడ్డి వంగా

ఛాయాగ్రహణం: పవన్ పప్పుల

కూర్పు: వేణుగోపాల్ రెడ్డి

“అర్జున్ రెడ్డి, అనిమల్” లాంటి సినిమాల తర్వాత సందీప్ రెడ్డి వంగా ఒక సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నాడు అంటే ఉండే ఆసక్తి వేరు. “రోమాంచకం” అనే సినిమాకి ప్రత్యేక ఆకర్షణ సందీప్ రెడ్డి వంగా, జనాల్లోకి సందీప్ సినిమాగానే వెళ్లింది. సుమంత్ ప్రభాస్, అనంతిక కీలకపాత్రలు పోషించిన ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వేణుగోపాల్ రెడ్డి దర్శకుడిగా పరిచయమైన ఈ చిత్రం ప్రేమ, హాస్యం, ఉత్కంఠను సమపాళ్లలో పంచగలిగిందా? లేదా? అనేది చూద్దాం..!!

కథ:

హైదరాబాద్ కుర్రాడు అన్వేష్ (సుమంత్ ప్రభాస్), చెన్నైలో సెటిలైన తెలుగమ్మాయి మైథిలి (అనంతిక) ఒక యాప్ లో పరిచయమై.. తొలిప్రేమ సంతోషాలన్నీ ఆన్లైన్ లోనే ఆస్వాదిస్తుంటారు. కరెక్ట్ గా కలుసుకుందాం అనుకునేసరికి లేనిపోని సమస్యలు తలెత్తుతాయి. అసలు వీళ్ల ప్రేమ రోమాంచితంగా ఎందుకు మారింది? ఈ ప్రయాణంలో ప్రేమ, హాస్యం, ఉత్కంఠ ఏ స్థాయిలో పండాయి? అనేది చూద్దాం..!!

నటీనటుల పనితీరు:

సుమంత్ ప్రభాస్ కి ఇది టైలర్ మేడ్ క్యారెక్టర్. అర్బన్ యువకుడిగా, ఇంట్లో తండ్రితో తిట్లు తినే కుర్రాడిగా ఒదిగిపోయాడు. అతడి ఈజ్ అనేది క్యారెక్టర్ కి ప్లస్ అయ్యింది. అయితే.. క్యారెక్టర్ ఆర్క్ అనేది లేకపోవడం, ఎస్టాబ్లిష్మెంట్ బాగోకపోవడంతో క్యారెక్టర్ లో రిలేటబిలిటీ లోపించింది.

అనంతిక మరోసారి నేచురల్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. అయితే.. ఆమె చేసే చాలా చర్యలకి లాజిక్ & సెన్స్ లేకపోవడంతో ఆమె పాత్ర కూడా వర్కవుట్ అవ్వలేదు. ఆమె చేసే పనులకు ఇచ్చిన రీజనింగ్ కూడా సిల్లీగా ఉంటుంది.

గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో ఫేమ్ నరేంద్ర రవి మరోమారు తన కామెడీ టైమింగ్ తో మెప్పించాడు. అతడి సింగిల్ లైన్ పంచులు, క్యారెక్టరైజేషన్ హిలేరియస్ గా వర్కవుట్ అయ్యాయి. సినిమాకి సేవియర్ గా నిలిచాడు.

అనుపమ కోడూరి అనే నటికి ఈ సినిమాలో కాస్త మంచి పాత్ర లభించింది. “గేదెల రాజు, KJQ” లాంటి సినిమాల్లో ఆమెను చూపించిన విధానం బాగోదు. ఈ సినిమాలో తల్లిగా ఆమెను నీట్ గా ప్రెజంట్ చేసి, ఆమెను చూసే విధానాన్ని మార్చారు. మరాఠీ నటుడు ఉపేంద్ర కొన్ని సీన్ల వరకు పర్వాలేదు అనిపించుకున్నాడు.

సాంకేతికవర్గం పనితీరు:

వాసుకి వైభవ్ సంగీతం సినిమాకి నవ్యతను తీసుకొస్తే.. పవన్ పప్పుల సినిమాటోగ్రఫీ వర్క్ ఫ్రెష్ నెస్ యాడ్ చేసింది. ఒక్క వైడ్ యాంగిల్ షాట్ కూడా లేకుండా బడ్జెట్ & ప్రొడక్షన్ డిజైన్ ని మ్యానేజ్ చేసిన విధానం బాగుంది. హైదరాబాద్ లోనే చెన్నై లొకేషన్ ని మ్యానేజ్ చేయడం, ఒరిజినల్ లైటింగ్ తోనే సినిమాని తెరకెక్కించడం బాగుంది.
దర్శకుడు వేణుగోపాల్ రెడ్డి కేవలం సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ లా కథ రాసుకున్నాడు. అందువల్ల కథనం ఆసక్తికరంగా లేకుండాపోయింది.

ప్రేమ అసలు కనిపించలేదు, ఇద్దరు నిబ్బా-నిబ్బిల మధ్య ఆకర్షణలా ఉంటుంది అంతే. ఇక హాస్యం మధ్యమధ్యలో పండింది తప్ప.. పూర్తిస్థాయిలో నవ్వించలేదు. ఇక ఉత్కంఠ అనేది కూడా పెద్దగా కనిపించలేదు. అందువల్ల.. కామెడీ తప్ప వేరే ఏమీ వర్కవుట్ అవ్వలేదు. సో, డైరెక్టర్ గా ప్రొడ్యూసర్ కి డబ్బులు వేస్ట్ అవ్వకుండా జాగ్రత్తపడ్డాడు కానీ, ప్రేక్షకులను ఎంగేజ్ చేయడంలో తడబడ్డాడు. అసలు ఎస్టాబ్లిష్మెంట్ సీన్స్ అయితే బేసిక్ లెవల్లో కూడా ఉండవు.

ఇంత వీక్ గా సినిమా ఎలా స్టార్ట్ చేశారు అనిపిస్తుంది. షేర్లు-చీరలు లాంటి పంచులు కూడా చిరాకు తెప్పిస్తాయి. అయితే.. ప్రీఇంటర్వెల్ బ్లాక్ & క్లైమాక్స్ మరియు సెకండాఫ్ లో వచ్చే కొన్ని సీన్స్ లో కామెడీ బాగా వర్కవుట్ అవ్వడంతో ఆడియన్స్ కి రిలీఫ్ దొరికింది. ఆ కారణంగా దర్శకుడిగా వేణుగోపాల్ రెడ్డి పర్వాలేదనిపించుకోగలిగాడు.

విశ్లేషణ:

సినిమాలో కథ అనేది పెద్దగా లేనప్పుడు, క్యారెక్టర్స్ లేదా సిచ్యుయేషన్స్ బాగా రాసుకోవాలి. అప్పుడు కథనంలో ఏదైనా లోపించినా.. పాత్రలు, వాటి వ్యవహారశైలి అలరిస్తాయి. అలా కాకుండా కేవలం కొన్ని సీన్స్ మీద మాత్రమే ఆధారపడి సినిమా మొత్తం నడిపిస్తామంటే “రోమాంచకం”లా ఉంటుంది. నరేంద్ర రవి కామెడీ సీన్స్ & డైలాగ్స్ తప్ప ఏదీ పెద్దగా పేలలేదు. దర్శకుడు వేణుగోపాల్ రెడ్డి ఈ సినిమాకి ఎడిటర్ కూడా కావడంతో.. చాలా సీన్స్ ని బలవంతంగా ఫైనల్ కట్ లో కూర్చినట్లుగా ఉంటుంది తప్పితే.. సినిమాగా అలరించవు. ఆ విషయంలో జాగ్రత్తపడి ఉంటే బాగుండేది. అది లేకపోవడంతో ఓ రెగ్యులర్ సినిమాగా మిగిలిపోయింది.

ఓవరాల్ గా.. ప్రేమరహితం, హాస్యభరితం, ఉత్కంఠలోపితం!

M9 రేటింగ్: 2/5

Share
Kalyan

I strongly believe reviews are personal opinions. At the same time, they should help audiences set the right expectations without bias. That’s the principle I follow. We’ve noticed there is a lot of confusion around r…

Recent Posts

Sujeeth Doing Overtime, But Can PK Match It?

The last time, Pawan Kalyan delivered a good theatrical experience to a reasonable extent was…

30 minutes ago

Pics: Nimrit Kaur Flaunts Sultry Grace In Blue Saree

Nimrit Kaur is redefining raw ethnic elegance with an earthy, unapologetically sultry photoshoot that is…

49 minutes ago