
Violence During AP Panchayat Polling Day
నేడు ఆంధ్రప్రదేశ్ గ్రామ పంచాయతీ రెండో దశ పోలింగ్ జరుగుతోంది. అయితే పంచాయతీ ఎన్నికలంటే అల్లర్లు, విధ్వంసం, పరస్పర దాడులు, బ్యాలెట్ పత్రాలు చించివేయడం ఎత్తుకుపోవడం వంటివి అనివార్యమా? అని సందేహం కలుగుతుంది.
అనంతపురం జిల్లా యల్లనూరులో పోలింగ్ బూత్ వద్ద రెండు వర్గాల మధ్య పరస్పరం దాడులు జరిగాయి. వీటిలో ఆరుగురు టీడీపి కార్యకర్తలు తీవ్రంగా గాయపడగా వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది.
ప్రకాశం జిల్లా ఉల్లగల్లు 1,2 పోలింగ్ బూత్‌లలో గుర్తు తెలియని వ్యక్తులు జొరబడి బ్యాలెట్ పత్రాలు ఎత్తుకుపోయినట్లు సమాచారం. జిల్లాలోని అయ్యవారిపాలెం గ్రామంలో రెండు వర్గాలు పరస్పరం దాడులు చేసుకున్నాయి.
జిల్లాలోని తాళ్ళూరు మండలంలోని నాగంబొట్లపాలెం పోలింగ్ బూత్‌లోకి ఓ వర్గానికి చెందినవారు ప్రవేశించి బ్యాలెట్ బాక్సులలో నీళ్ళు, ఇంకు పోసి విధ్వంసం సృష్టించారు.
పార్టీలకు అతీతంగా జరుగుతున్న ఈ ఎన్నికల్లో కూడా ఈ స్థాయిలో జరుగుతున్న అల్లర్లకు ఎవరు కారణం?కలిసి మెలిసి జీవించాల్సిన గ్రామ ప్రజలు పార్టీలు వారీగా చీలిపోయి పరస్పరం దాడులు చేసుకోవడం ఏమిటి? గ్రామీణ ప్రజలు తమ కోసం పని చేసే సర్పంచ్‌లను, వార్డు మెంబర్లను ఎన్నుకోవడానికి పరస్పరం గొడవ పడటం దేనికి?
ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో ఇలాంటి ఘటనలు జరిగినందున అవి పునరావృతం కాకూడదనే ఎన్నికల సంఘం వేలాది మంది పోలీసులను మోహరించింది. ఎక్కడికక్కడ డ్రోన్ కెమెరాలు, బాడీ కెమెరాలతో నిఘా పెంచింది.
ఇంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినప్పటికీ, ప్రశాంతంగా సాగాల్సిన ఈ పోలింగ్ ప్రక్రియలో ఈవిధంగా అల్లర్లు జరుగుతున్నాయంటే ఈ వైఫల్యానికి ఎవరిని నిందించాలి?
Chiranjeevi has confirmed January 13, 2027, as Kaaka’s release date, ending speculation over whether the…
After having a successful run in theatres, Hanuman Ansh has finally arrived on OTT. It…