
ఆదివారం రెండో దశ పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 4,975 సర్పంచ్ పదవులకు ఇప్పటికే 1,171 ఏకగ్రీవం అయినందున మిగిలిన 3,804 స్థానాలకు రేపు ఎన్నికలు జరగనున్నాయి.
వీటిలో అత్యధిక సర్పంచ్ పదవులు/ఏకగ్రీవాలు జరిగిన జిల్లాలు: శ్రీకాకుళం: 388/46, తిరుపతి: 373/136, విజయనగరం: 308/64, నెల్లూరు: 297/93, చిత్తూరు: 253/80, అనకాపల్లి: 213/33, కడప: 202/116. అల్లూరి సీతారామరాజు జిల్లాలో 87 సర్పంచ్ పదవులకు ఒక్కటి కూడా ఏకగ్రీవం కాలేదు.
అలాగే మొత్తం 49,318 వార్డులకు 19,561 ఏకగ్రీవం అయ్యాయి. కనుక రేపు మిగిలిన 29,667 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. వీటికి 63,410 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు.
మరో విశేషమేమిటంటే, తొలిదశ ఎన్నికల్లో 760 సర్పంచ్ పదవులు ఏకగ్రీవం కాగా, రేపు జరగబోయే రెండో దశ ఎన్నికల్లో 1,171 సర్పంచ్ పదవులు ఏకగ్రీవం అయ్యాయి. అంటే రెండో దశలో ఏకగ్రీవాలు ఏకంగా 64.90% పెరిగాయన్న మాట!
మొదటి దశ పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాలు పోగా మిగిలిన 3,189 పదవులకు ఎన్నికలు జరుపగా 77.65% పోలింగ్ నమోదు అయ్యింది. దానిలో… టీడీపి: 2,326 సర్పంచ్ పదవులు గెలుచుకొని 58.90% సీట్లు సాధించింది.
జనసేన: 189 సర్పంచ్ (4.79%), బిజేపి: 25 సర్పంచ్ (0.63%), కూటమిలో మూడు పార్టీలు కలిసి మొత్తం 2,540 సర్పంచ్ పదవులు 64.32% సీట్లు సాధించాయి.
వైసీపీ: 1,111 సర్పంచ్ పదవులకు కేవలం 28.13% సాధించగలిగింది. స్వతంత్రులు, రెబెల్స్: 293 సర్పంచ్ పదవులు గెలుచుకుని 7.42% సాధించారు. వివాదాస్పదంగా ఉన్న మరో 5 సర్పంచ్ పదవుల ఫలితాలు ఇంకా వెలువడాల్సి ఉంది.
రెండో దశలో ఏకగ్రీవాలు గణనీయంగా పెరగడం, వాటిలో మెజార్టీ స్థానాలు కూటమి మద్దతుదారులు దక్కించుకోవడంతో ఎన్నికలకు ముందే కూటమి పార్టీలు సగం విజయం సాధించినట్లు భావించవచ్చు.
If anything, Rajamouli must be the most celebrated film maker of this generation in Indian…
Union Minister G. Kishan Reddy’s three-day ‘Nasha Mukt Bharat’ padyatra in Hyderabad was more than…