
కేంద్ర ఎన్నికల కమీషన్ శనివారం లోక్‌సభ, శాసనసభ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడంతో దేశవ్యాప్తంగా వెంటనే ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. ఏపీ ఎన్నికల సంఘం ప్రధాన అధికారి ముకేష్ కుమార్ మీనా, నిన్న సాయంత్రమే రాష్ట్రంలో ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్సు ద్వారా సమావేశమయ్యారు.
రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చినందున బహిరంగ ప్రదేశాలు, ప్రభుత్వ కార్యాలయాలు, సచివాలయాలు తదితర ప్రాంతాలలో రాజకీయ పార్టీలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ బ్యానర్లు, కటౌట్లు ఆదివారం మధ్యాహ్నం 3 గంటలలోగా తొలగించాలని ఆదేశించారు. అధికారులు ఎవరైనా ఉపేక్షిస్తే సహించబోమని హెచ్చరించారు.
దీంతో శనివారం సాయంత్రం నుంచే రాష్ట్ర వ్యాప్తంగా వైసీపి ఏర్పాటు చేసిన లక్షలాది ‘సిద్దం’ ఫ్లెక్సీ బ్యానర్లను మునిసిపల్ సిబ్బంది తొలగిస్తున్నారు. పలుచోట్ల టిడిపి, జనసేన పార్టీల అభిమానులు వచ్చి సిద్దం బ్యానర్లను తొలగించడంలో వారికి సాయపడుతున్నారు.
రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన్నట్లు ఎన్నికల కమీషన్ ప్రకటించగానే, ప్రజలే వైసీపి పోస్టర్లను పేకేస్తుండటం గమనిస్తే ప్రజలు కూడా వైసీపితో ఎంతగా వేశారిపోయారో అర్దం చేసుకోవవచ్చు.
జగన్మోహన్ రెడ్డి ఫోటోతో ‘సిద్దం’ అంటూ వైసీపి లక్షలాది ఫ్లెక్సీ బ్యానర్లు, వాల్ పోస్టర్లు, జెండాలు ముద్రింపజేసి వాటితో రాష్ట్రంమంతా నింపేసింది. వాటన్నిటికీ ఎన్ని వందల కోట్లు ఖర్చు చేసిందో తెలీదు కానీ ఇప్పుడు అవన్నీ వాడుకోలేని పరిస్థితి ఏర్పడింది. వైసీపి నేతలే ఈ ఖర్చు భరించి ఉంటారు కనుక ఆ మేరకు వారందరూ నష్టపోయారు.
ముకేష్ కుమార్ మీనా నిన్నటి సమావేశంలోనే వాలంటీర్లను ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని, ఎవరైనా తమ ఆదేశాలను అతిక్రమించిన్నట్లు తెలిస్తే కటిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎన్నికలకు సమబందించి ఫిర్యాదుల కోసం ఎన్నికల సంఘం ‘సీ విజిల్’ (cVIGIL) అనే మొబైల్ యాప్ ఏర్పాటు చేసింది. కనుక ప్రజలు దాని ద్వారా తమకు ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని ముఖేష్ కుమార్ మీనా చెప్పారు.
The second week of Bigg Boss concluded with Krishnudu's eviction. And Nagarjuna announced that the…
“Enough of advice. We want seats.” That appears to be the mood among some Jana…